Begin typing your search above and press return to search.

అంతలా ఛేజ్ చేస్తున్న మీడియా

By:  Tupaki Desk   |   12 Jan 2017 12:38 PM GMT
అంతలా ఛేజ్ చేస్తున్న మీడియా
X
స్టార్లను ఒక్క ఫోటో ఎక్స్ క్లూజివ్ గా క్లిక్ చేయడం కోసం ఫోటోగ్రాఫర్స్ ఎంతకైనా తెగించేస్తారని.. ఎంత ధైర్యం అయినా చేస్తారని వింటూ ఉంటాం. అప్పుడప్పడు చూసే ఛాన్స్ కూడా వస్తుంది లెండి. తాజాగా దీపికా పదుకొనేను బాలీవుడ్ మీడియా ఛేజ్ చేసిన తీరు అందరికీ షాక్ తగిలించేస్తోంది.

విన్ డీజిల్- దీపికా పదుకొనే నటించిన హాలీవుడ్ మూవీ ట్రిపుల్ ఎక్స్ రిటర్న్ ఆఫ్ క్సాండర్ కేజ్.. ఇండియాలోనే మొదట రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. ముంబైలో ప్రమోషన్స్ కోసం వచ్చాడు విన్ డీజిల్. స్వయంగా దీపికనే గ్రాండ్ వెల్ కం చెప్పి మరీ.. ఈ హీరోతో పాటు ఒకే కార్ లో జర్నీ చేసింది. విన్ డీజిల్-దీపికలను పక్కపక్కనే చూపించే ఫోటో కోసం. బాలీవుడ్ మీడియా వెంటాడిన తీరు చూస్తే.. కెవ్వ్ మనాల్సిందే.

ఒక కెమేరామ్యాన్ బైక్ పై వెనక్కి తిరిగి కూర్చుని.. రన్నింగ్ కార్ ను ఛేజ్ చేస్తూ ఫోటోలు తీస్తుంటే.. మరో కెమేరా పర్సన్ ఏకంగా కార్ టాప్ పై కూర్చుని.. తన కెమేరా కంటికి ఈ జంట దొరకబుచ్చుకునేందుకు తెగ ప్రయత్నాలు చేసేస్తున్నారు. వాళ్ల కెమేరాలకు ఈ జంట చిక్కారో లేదో కానీ.. వీళ్లు ప్రయత్నాలను మాత్రం ఫోటో తీసి నెట్ లో పెట్టేశారు. ఇప్పుడీ ఛేజింగ్ ఫోటోనే ఎక్కువ వైరల్ అయిపోతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/