Begin typing your search above and press return to search.

వ‌ర‌ల్డ్ నంబ‌ర్ వ‌న్ స్టార్‌ తో దీపిక‌

By:  Tupaki Desk   |   14 March 2019 6:05 AM GMT
వ‌ర‌ల్డ్ నంబ‌ర్ వ‌న్ స్టార్‌ తో దీపిక‌
X
ప్ర‌పంచంలోనే నంబ‌ర్ 1 పారితోషికం అందుకునే హాలీవుడ్ క‌థానాయిక‌గా స్కార్లెట్ జాన్స‌న్ పేరు మార్మోగిపోతోంది. ఆ మేర‌కు ఫోర్బ్స్ టాప్ 10 జాబితాలో నంబ‌ర్ 1 స్టార్ గా ఎంపికైంది. హాలీవుడ్ లో ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ లో న‌టించిన స్కార్లెట్ ప్ర‌స్తుతం రిలీజ్ బ‌రిలో ఉన్న `అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్` చిత్రంలో బ్లాక్ విడో పాత్ర‌లో న‌టించింది. ఈ అమ్మ‌డు ఈ సినిమా కోసం అందుకున్న పారితోషికం ఎంతో తెలిస్తే క‌ళ్లు భైర్లు క‌మ్మాల్సిందే.

స్కార్లెట్ జాన్స‌న్ కి అవెంజ‌ర్స్ నిర్మాత‌లు ఏకంగా 250 కోట్లు ($40.5m) పైగా పారితోషికం అందుకుంటోంది. ఏంజెలినా జోలీ ($28m), జెన్నిఫ‌ర్ ఆనిస్ట‌న్, వండ‌ర్ ఉమెన్ గాల్ గోడోట్ వంటి స్టార్ల‌ను అధిగ‌మించి స్కార్లెట్ ఇంత పెద్ద మొత్తం పారితోషికం అందుకుంటోంది. అంత పెద్ద స్టార్ తో క‌లిసి ప్ర‌ఖ్యాత వోగ్ మ్యాగ‌జైన్ - ఏప్రిల్ 2019 క‌వ‌ర్ పేజీకి బాలీవుడ్ క‌థానాయిక‌ దీపిక ప‌దుకొనే ఫోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు యూత్ సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి.

ఇదే ఫోటోలో స్కార్లెట్, దీపిక‌ల‌తో పాటు, ద‌క్షిణ కొరియాకి చెందిన ప్ర‌ముఖ క‌థానాయిక బావో డూనా కూడా ద‌ర్శ‌న‌మిచ్చింది. ప్ర‌పంచ సినీయ‌వ‌నిక‌పై ప్రియాంక చోప్రా హ‌వా సాగుతున్న వేళ దీపిక ప‌దుకొనే కూడా రేస్ లోకి వెళుతోందా? మునుముందు హాలీవుడ్ ప్ర‌య‌త్నాల్లో ఉందా? అన్న‌ది తెలియాలంటే కాస్త వేచి చూడాల్సిందే. ఇక‌పోతే దీపిక ప‌దుకొనే ఇటీవ‌లే ర‌ణ‌వీర్ సింగ్ ని పెళ్లాడింది కాబ‌ట్టి హాలీవుడ్ లో న‌టించేందుకు అంగీక‌రిస్తారా? అన్న‌దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.