Begin typing your search above and press return to search.

పద్మావత్ బ్యూటీ ఎందుకు నో చెబుతోంది?

By:  Tupaki Desk   |   21 May 2018 5:48 AM GMT
పద్మావత్ బ్యూటీ ఎందుకు నో చెబుతోంది?
X
బాలీవుడ్ లో ప్రతి సినిమా సినిమాకు స్టార్స్ హోదా మారుతుంటుంది. ముఖ్యంగా రెమ్యునరేషన్ విషయంలో అయితే చాలా మార్పులు వస్తాయి. ఓ సినిమా డిజాస్టర్ అయితే ఇంతవరకు తగ్గుతుంది అనే విషయంలో క్లారిటీ ఉండదు గాని హిట్ అందుకుంటే మాత్రం పేమెంట్ డబుల్ అయినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ పరిస్థితి అలానే ఉంది. ఒకేలా హిట్ పడితే వరుసగా ఆఫర్లను కొట్టేస్తున్నారు.

అయితే పద్మావత్ బ్యూటీ దీపికా పదుకొనె మాత్రం ఎన్ని ఆఫర్స్ వచ్చినా కుడా ఒకే చెప్పడం లేదట. దీంతో అనేక రూమర్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఆమె బాయ్ ఫ్రెండ్ గా పిలవబడుతున్న రన్ వీర్ సింగ్ తో మరికొన్ని రోజుల్లో పెళ్లి కానుందని అందుకే సినిమాలకు కాస్త గ్యాప్ ఇవ్వాలని అనుకుంటుందట. ఈ మధ్య హీరోయిన్స్ పెళ్లి చెలుకోవడం చూసి తాను కూడా ఒక ఇల్లాలిగా సెట్ అయ్యి కెరీర్ ను కంటిన్యూ చేయాలని అనుకుంటుందట.

ఇక మరొక రూమర్ విషయానికి వస్తే.. గత కొంత కాలంగా దీపిక మెడ నొప్పితో బాధపడుతున్నందు వలన కూడా సినిమాలను ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. అదే విధంగా రెమ్యునరేషన్ విషయంలో కూడా సెట్ కాక.. అలాగే తనకు నచ్చిన పాత్రలు రాకపోవడం మరో కారణమని పలు రకాల గాసిప్స్ వస్తున్నాయి. అయితే ఈ విషయాలపై దీపిక పెద్దగా స్పందించడం లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ఒకే ఒక్క సినిమా జీరో. షారుక్ ఖాన్ మరగుజ్జు గా కనిపించనున్న ఆ సినిమాలో దీపికతో పాటు అనుష్క శర్మ కూడా నటిస్తోంది.