Begin typing your search above and press return to search.

పద్మావతి.. బికినీవతి అయ్యిందే

By:  Tupaki Desk   |   22 Nov 2017 9:21 AM GMT
పద్మావతి.. బికినీవతి  అయ్యిందే
X
ప్రస్తుతం పద్మావతి అని పేరు గుర్తొస్తే చాలు సినిమా కన్నా వివాదాలే ఎక్కువగా గుర్తొస్తున్నాయి. తెరపై ఏ స్థాయిలో డైలాగులు ఉంటాయో గాని విడుదలకు ముందే సినిమాపై కొన్ని వివాదస్పద డైలాగులు వచ్చి పడుతున్నాయి. ఏకంగా తలలు తెగిపడతాయి అంటూ.. రివార్డులు ప్రకటిస్తున్నారు. మొదట ఎదో లైట్ గా తీసుకున్న చిత్ర యూనిట్ ఇప్పుడు తలలు పట్టుకునే పరిస్థితికి వచ్చింది.

ముఖ్యంగా దీపిక పదుకొనె తలపై రూ.5 కోట్లు రూ.10 కోట్లు అని నజరానా ప్రకటించడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ విషయంపై దీపిక ఒక్క కామెంట్ కూడా చేయకపోవడం గమనార్హం. అయితే ఆమె బాధపడుతుందో అని అనుకోవచ్చు. ఇక అమ్మడు పద్మావతి లుక్ లో కొంచెమైనా హాట్ గా కనిపించలేదు. సాంప్రదాయానికి మరో అర్ధం అనేలా పద్దతిగా చీరలో ఎలా కనిపించిందో తెలిసిందే.

అయితే రీసెంట్ గా ఒక ఫోటోషూట్ లో దీపిక టోటల్ గా హాట్ కి మరో అర్దాన్ని చెప్పింది. ఫుల్ బికినీ లో స్కిన్ షోతో కుర్రకారు మతులు పోగెట్టేసింది. పద్మావతి వివాదం ఎంత హాట్ గా ఉందొ అంతకంటే ఎక్కువ స్థాయిలో తన అందాలతో సెక్సీ ఫోజులు ఇచ్చేసింది. పోటోలను చూస్తుంటే నెటిజన్స్ లైకులతో షేర్లతో మరింత వైరల్ అయ్యేలా చేస్తున్నారు.

ఇక అమ్మడు ఈ టైమ్ లో ఇలా కావాలనే ఫిలింఫేర్ మ్యాగజైన్ కు పోజులు ఇచ్చిందా అనే కామెంట్స్ చాలానే వినిపిస్తున్నాయి. అంతే కాకుండా పద్మావతి బికినీవతి అయ్యింది అని కూడా కామెంట్స్ చేస్తున్నారు.