Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ట్రిపుల్ ఎక్స్ రేంజ్ ఇదే

By:  Tupaki Desk   |   24 Jan 2017 7:53 AM GMT
ఫోటో స్టోరి: ట్రిపుల్ ఎక్స్ రేంజ్ ఇదే
X
బాలీవుడ్ కం హాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే.. ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది. ఈమె నటించిన హాలీవుడ్ మూవీ ట్రిపుల్ ఎక్స్.. ది రిటర్న్ ఆఫ్ ది క్సాండర్ కేజ్ రిలీజ్ సందర్భంగా.. దీపిక పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. హాలీవుడ్ కంటే ఇండియాలో ఓ ఐదు రోజులు ముందే రిలీజ్ అయిన ట్రిపుల్ ఎక్స్.. టాక్ బాగోలేకున్నా మంచి వసూళ్లు రాబడుతోంది.

ఇదే ఉత్సాహంతో దీపికా పదుకొనే తెగ ఫోటోషూట్స్ చేసేస్తోంది. అభిమానులకు నిద్ర పట్టనివ్వని రేంజ్ లో.. తాజాగా ఫిలిం ఫేర్ మేగజైన్ కోసం ఈ సెక్సీ భామ పోజులు ఇచ్చింది. సహజంగా టాప్ హీరోయిన్ తో ఫోటో షూట్ అంటే.. కవ్వించే ఫోటోలు కామన్. కానీ.. దీపిక మాత్రం మొత్తం ఫోటో షూట్ అంతా 'బ్రా'లతోనే కంప్లీట్ చేసేసింది. ఆ పైన ఓవర్ కోట్ వేసినా.. వేయకున్నా.. బ్రాలోంచి తొంగిచూస్తున్న అందాల విందు మాత్రం కామన్.

మరోవైపు నాభి సోకులు.. నడుం ఒంపుల విషయంలోనే కొంచెం కూడా కాంప్రమైజ్ కాలేదు దీపికా పదుకొనే. ప్రస్తుతం పద్మావతి అంటూ సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ లో టైటిల్ రోల్ చేస్తున్న ఈ సెక్సీ సుందరి.. ట్రిపుల్ ఎక్స్ ఇచ్చిన జోష్ తో.. మరిన్ని హాలీవుడ్ అవకాశాలు వస్తాయని నమ్మకంగా ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/