Begin typing your search above and press return to search.

ముద్దులాడుతూ దొరికిపోయిన రణవీర్, దీపిక

By:  Tupaki Desk   |   6 Oct 2015 9:30 AM GMT
ముద్దులాడుతూ దొరికిపోయిన రణవీర్, దీపిక
X
చెప్పాపట్టకుండా ఓ ఫారిన్ టూరుకి వెళ్లారు. వారమో, పది రోజులో కావాల్సినంత ఎంజాయ్ చేశారు. తిరిగి ఫ్లైట్ ఎక్కి ముంబయి ఎయిర్ పోర్టులో దిగారు. ఇకనైనా చక్కగా ఇళ్లకు పోవచ్చు కదా. ఆ పని ఆపేసి రోడ్డుపై రొమాన్స్ మొదలుపెట్టారు. మళ్లీ ఎప్పుడు కలుస్తామో ఏమో అనుకున్నారో ఏంటో కానీ కారెక్కబోతూ ఓ ముద్దులాడేసుకున్నారు. బాలీవుడ్ లవర్స్ రణ్ వీర్ సింగ్ - దీపికా పదుకునేలా రోడ్ సైడ్ రొమాన్స్ ఇది.

ముంబయి ఎయిర్ పోర్ట్ నుంచి బయటికి వస్తూ కారెక్కబోతూ రణ్వీర్ - దీపికల సయ్యాట ఇది. మసక మసక చీకటి కదా. ఎవ్వరూ చూడరులే అనుకున్నారేమో. సెండాఫ్ హగ్ ఇవ్వబోతూ లిప్ లాక్ లాగించేశారు. కానీ అక్కడే ఉన్న ఎవరూ ఇద్దరూ ఫొటోలు తీసేసి సోషల్ మీడియాకు ఎక్కించేశారు. ఆ ఫొటోలిప్పుడు రచ్చ రచ్చ చేసేస్తున్నాయి. అయినా నాలుగ్గోడల మధ్య ఏం చేసినా అడిగేవాళ్లు లేనపుడు.. మళ్లీ ఈ ఓపెన్ రొమాన్సులేంటో మరి.