Begin typing your search above and press return to search.

కాస్ట్‌లీ దీపిక.. ఫోర్బ్స్‌ లో ఎక్కేసింది

By:  Tupaki Desk   |   24 Aug 2016 8:49 AM GMT
కాస్ట్‌లీ దీపిక.. ఫోర్బ్స్‌ లో ఎక్కేసింది
X
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే బాగా బిజినే కాదు.. బాగా కాస్ట్లీ హీరోయిన్ కూడా. టాప్ హీరోయిన్ స్టేటస్ ని గత కొన్నేళ్లుగా ఎంజాయ్ చేస్తున్న ఈ సుందరి.. అందుకు తగ్గట్లుగానే రెమ్యూనరేషన్ వసూలు చేస్తుంది. అటు సినిమాల్లోను.. ఇటు ఎండార్స్ మెంట్స్ తోను.. మరోవైపు ఈవెంట్స్ లో పాల్గొనడం ద్వారానూ ఈ అమ్మడు బాగా సంపాదించేస్తోంది.

ప్రస్తుతం హాలీవుడ్ పట్టాలు కూడా ఎక్కేసిన దీపిక సంపాదన ఏ రేంజ్ లో ఉందంటే.. ఇండియాలోనే అత్యధికంగా సంపాదిస్తున్నది ఈమే. దీనిలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సినది ఏం లేదు కానీ.. మొత్తం ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదించిన భామల్లో దీపికా పదుకొనేకి పదో స్థానం దక్కింది. ఈమె ఏడాది సంపాదన ఎంతో తెలుసా.. 10 మిలియన్ డాలర్లు. మన రూపాయల్లో చెప్పుకుంటే.. దాదాపు 68 కోట్లు. ఇది కేవలం ఏడాది లెక్క మాత్రమే అని గుర్తుంచుకోవాలి.

ఇలా ఫోర్బ్స్ లిస్ట్ లో టాప్ టెన్ లో ప్లేస్ దక్కించుకున్నది దీపికా మాత్రమే. ఇది గతేడాది జూన్ 1 నుంచి ఈ ఏడాది జూన్ 1 వరకూ అందుకున్న పారితోషికాల మొత్తం ఇది. దీపికానే నెంబర్ వన్ అనడంలో ఎనీ మోర్ డౌట్స్!