Begin typing your search above and press return to search.

రణ్ వీర్ పౌరుషానికి దీపిక బ్రేక్

By:  Tupaki Desk   |   26 Nov 2018 9:00 AM GMT
రణ్ వీర్ పౌరుషానికి దీపిక బ్రేక్
X
దక్షిణాదిన మెజారిటీ మగవాళ్లు మీసం పెంచుతారు. మీసాన్ని పౌరుషానికి ప్రతీకగా భావిస్తారు. కోర మీసం పెంచి దాన్ని తిప్పుతూ తమ మగతనాన్ని.. పౌరుషాన్ని చాటే ప్రయత్నం చేస్తుంటారు. మన హీరోల్లో కూడా చాలామంది మీసంతోనే కనిపిస్తారు. కానీ ఉత్తరాదిన మీసాన్ని పౌరుషానికి ప్రతీకగానీ.. ఫ్యాషన్ గా కానీ.. భావించేవాళ్లు చాలా తక్కువ. ఎక్కువగా అక్కడి హీరోలు కూడా క్లీన్ షేవ్ తో కనిపిస్తాడు. ఐతే బాలీవుడ్లో మీసంతో కనిపించే అతి కొద్దిమందిలో రణ్వీర్ సింగ్ ఒకడు. అతను చాలా ఏళ్లుగా కోర మీసంతోనే కనిపిస్తున్నాడు. సినిమాల్లో కూడా అతడి లుక్ అలాగే ఉంటోంది. దీని వల్ల అతను మిగతా హీరోలకు భిన్నంగా కనిపిస్తుంటాడు. మీసాన్ని మెలితిప్పి.. దువ్వుతూ రణ్వీర్ ఇచ్చే పోజులు భలే ఉంటాయి. కానీ అతడి పౌరుషానికి భార్య దీపికా పదుకొనే బ్రేక్ వేసింది.

ఇటీవలే రణ్వీర్-దీపిక పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లయిన కొన్ని రోజులకే అతడి మీసం తెగిపోయింది. ఆ పని స్వయంగా దీపికనే చేసింది. అతడి మీసాన్ని కట్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్న వీడియో ఒకటి ఇటీవలే బయటికి వచ్చింది. అప్పుడు దీపిక ఆనందం మామూలుగా లేదు. పెళ్లయ్యాక ఏ మగాడైనా భార్య చెప్పినట్లు నడుచుకోవాల్సిందే.. భార్య నియంత్రణలో ఉండాల్సిందే అన్న భావనకు సూచికగా కనిపిస్తోంది ఈ వీడియో. పాపం దీపిక తన మీసం కట్ చేశాక రణ్వీర్ కొంచెం దీనంగా ఫేస్ పెట్టాడు. తర్వాత పూర్తిగా మీసం తీసేసి ఫొటోలకు పోజులిచ్చాడు. రణ్వీర్ కొత్త సినిమా ‘సింబా’లో అతను మీసంతోనే కనిపించనున్నాడు. బహుశా రణ్ వీర్ తర్వాతి సినిమాలో మీసంతో పని లేకే.. ఇలా కోత వేయించుకుని తమాషా చేశాడేమో అనుకుంటున్నారు జనాలు.