Begin typing your search above and press return to search.

ఇవాంకా స‌ద‌స్సుకు `ప‌ద్మావ‌తి` నిర‌స‌న‌?

By:  Tupaki Desk   |   21 Nov 2017 10:39 AM GMT
ఇవాంకా స‌ద‌స్సుకు `ప‌ద్మావ‌తి` నిర‌స‌న‌?
X
`ప‌ద్మావతి` వివాదంపై బాలీవుడ్ సెల‌బ్రిటీలు తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా విడుద‌ల‌పై బాలీవుడ్ అంతా ఏకమై నౌ ఆర్ నెవ‌ర్ అంటూ.... ప్రభుత్వం పై పోరాడాలని ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి ష‌బానా అజ్మీ పిలుపునిచ్చారు. అంతేకాకుండా కేంద్ర ప్ర‌భుత్వం నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల‌ను బాలీవుడ్ సెల‌బ్రిటీలు బాయ్ కాట్ చేయాల‌ని కోరారు. గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఐఎఫ్ ఎఫ్ ఐ) వేడుకలకు దూరంగా ఉండి ప్రభుత్వానికి తమ నిరసన తెలపాలన్నారు. ఈ నేప‌థ్యంలో `ప‌ద్మావ‌తి` హీరోయిన్‌ దీపికా ప‌దుకొనే ఓ అంత‌ర్జాతీయ స‌ద‌స్సును బాయ్ కాట్ చేసింది.

ఈ నెల 28 - 29 - 30 తేదీల్లో హైద‌రాబాద్ లో ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు జ‌ర‌గ‌బోతోన్న సంగ‌తి తెలిసిందే. ఆ స‌ద‌స్సుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కూతురు ఇవాంక ట్రంప్‌ ముఖ్య అతిథిగా హాజ‌రుకానున్నారు. వాస్త‌వానికి ఆ సదస్సులో దీపికా పదుకునే పాల్గొనాల్సి ఉంది. అంతేకాకుండా, ఆ స‌ద‌స్సులో ‘హాలీవుడ్‌ టు నాలీవుడ్‌ టు బాలీవుడ్‌’అనే అంశంపై దీపిక ప్రసంగించాల్సి ఉంది. అయితే, ఆ స‌ద‌స్సు నుంచి దీపిక‌ తన పేరును ఉపసంహరించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప‌ద్మావ‌తి ద‌ర్శ‌కుడు భ‌న్సాలీ - దీపిక ల త‌ల‌ల‌పై 10 కోట్ల న‌జ‌రానాను ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో దీపిక భ‌ద్ర‌త‌పై అనుమానాలు నెల‌కొన్నాయ‌ని, భద్రతా కారణాల దృష్ట్యానే దీపిక ఈ సదస్సు నుంచి తప్పుకుందని వినికిడి. ఆ చిత్ర విడుద‌ల‌పై నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న రాజ్ పుత్ క‌ర్ణిసేన కార్య‌క‌ర్తులు - ప‌లువురు బీజేపీ నేత‌లు - నిరసన కారులు ఆ సదస్సును అడ్డుకుంటారని వార్త‌లు రావ‌డంతో దాని నిర్వహకులే దీపిక‌ను త‌ప్పించార‌నే పుకార్లు వినిపిస్తున్నాయి.

రెండు రోజుల క్రితం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తిలో జ‌రిగిన సోష‌ల్ మీడియా సెల‌బ్రిటీస్ అవార్డుల కార్య‌క్ర‌మానికి దీపికా ప‌దుకొనే హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. ఆ స‌ద‌స్సుకు నిర‌స‌న‌కారుల నుంచి ఎటువంటి ఇబ్బంది క‌ల‌గ‌లేదు. అటువంటిది, హైద‌రాబాద్ లో ఎందుకు ఇబ్బందులు ఏర్ప‌డ‌తాయ‌ని ప‌లు సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ష‌బానా అజ్మీ స‌హా ప‌లువురు బాలీవుడ్ సెల‌బ్రిటీలు ఇచ్చిన పిలుపు ప్ర‌కార‌మే దీపికా ప‌దుకొనే ఆ స‌ద‌స్సును బాయ్ కాట్ చేసింద‌ని కొంత‌మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఆ స‌ద‌స్సుకు హాజ‌రుకాకుండా ఉండి....ప‌ద్మావ‌తి విడుద‌ల‌పై జ‌రుగుతోన్న వివాదాన్ని అంత‌ర్జాతీయ స్థాయిలో హైలైట్ చేయాల‌ని దీపిక భావించి ఉండ‌వ‌చ్చ‌ని పుకార్లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా, ఆ స‌ద‌స్సుకు ప్ర‌ధాని మోదీ కూడా హాజ‌రు కాబోతుండ‌డంతో ఈ ర‌కంగా త‌న నిర‌స‌న‌ను తెలిపే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే, దీపిక సద‌స్సుకు హాజ‌రుకాక‌పోవ‌డానికి గ‌ల‌ కారణాలు వెల్ల‌డికాలేదు.