Begin typing your search above and press return to search.

ఈ ముద్దు ఫోటో పాతదేనబ్బా

By:  Tupaki Desk   |   18 Aug 2017 11:44 AM GMT
ఈ ముద్దు ఫోటో పాతదేనబ్బా
X
బాలీవుడ్ తారల మధ్య సాన్నిహిత్యం కాస్త ఎక్కువైపోయిందంటే చాలు బాలీవుడ్ మీడియా అస్సలు ఆగదు. వారు ఎలాంటి సెలబ్రెటీలు అయినా సరే ఏ మాత్రం ఆలోచించకుండా అనేక కథనాలను ప్రసారం చేస్తాయి. అంతే కాకుండా లైవ్ డిబేట్ లు పెట్టిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇక తారలు కూడా మీడియాపై ఒక్కోసారి కోప్పడినా.. ఆ తర్వాత కామన్ అనుకోని లైట్ తీసుకుంటున్నారు. అంతే కాకుండా ఒక్కోసారి తప్పటడుగు వేసినా వారి పర్సనల్ ఫొటోస్ బయటపడినా కూడా తారలు ఈ మధ్య పెద్దగా పట్టించుకోవడం లేదు.

అయితే రీసెంట్ గా ఓ బాలీవుడ్ జంట గాఢంగా ముద్దు పెట్టుకుంటున్న ఓ ఫోటో నెట్ లో వైరల్ అవుతోంది. ఓ నెటిజన్ సోషల్ మీడియాలో #DeepVeer అని హ్యాష్ ట్యాగ్ చేసి ఫోటో పోస్ట్ చేయడంతో చూసిన వారందరు ఒక్కసారిగా షాక్ కి గురవుతున్నారు. కానీ ఆ ఫోటో రణవీర్ దీపికా 2015 వోగ్ ఫోటో షూట్ లోనిదనే తెలుస్తోంది. ఇది చాలా పాత ఫోటో. అప్పట్లో సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో వచ్చిన "బాజీరావ్ మస్తానీ" సినిమాలో వీరిద్దరూ మెయిన్ లిడ్ లో నటించారు. ఆ టైములోనే ఈ షూట్ కూడా చేశారు. ఆ సినిమా హిట్ తర్వాత వీరిద్దరూ రిలేషన్ తరువాత తెవెల్ కు తీసుకెళ్ళినట్లు అందరికీ తెలిసిందే.

కాని ఈ ఇప్పుడు ఈ లిప్ లాక్ ఫోటో బయటపడటంతో ప్రస్తుతం బాలీవుడ్ మీడియా కూడా ఈ న్యూస్ ను పెద్దదిగా చేసి చూపిస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఈ ఫోటో హాట్ టాపిక్ గా మారింది. లక్కీ పెయిర్స్ అని కామెంట్స్ కూడా వినబడుతున్నాయి. కానీ రణవీర్ మాత్రం ఇలాంటి వ్యవహారాలకు తాను చాలా దూరంగా ఉంటానని చాలాసార్లు మీడియాతో చెప్పాడు. మరి ప్రస్తుతం #DeepVeer అని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఫోటోపై ఎలా స్పందిస్తాడో చూడాలి.