Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్ లో ఆమెను త‌ప్పుగా చూపించార‌ట‌

By:  Tupaki Desk   |   20 Sep 2017 4:10 AM GMT
బిగ్‌ బాస్ లో ఆమెను త‌ప్పుగా చూపించార‌ట‌
X
బిగ్ బాస్‌కు కొత్త గ్లామ‌ర్‌ను తెచ్చిన ముద్దుగుమ్మ దీక్షాపంత్‌. ఆమె ఎంట్రీతో బిగ్ బాస్ ఫ్రేంకు మ‌రింత గ్లామ‌ర్ వ‌చ్చింద‌ని చెప్పాలి. ఈ రియాలిటీ షోలోని పోటీదార్ల అంద‌రికంటే భిన్నంగా క‌నిపించిందామె. అమాయ‌కంగా క‌నిపిస్తూ అంద‌రి సానుభూతిని పొందిన దీక్షా గ‌డిచిన వారాంతంలోనే ఎలిమినేట్ అయ్యారు.

త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతున్న‌ట్లు క‌నిపించిన దీక్షా.. త‌న తీరుకు భిన్నంగా ఎలిమినేట్ అయ్యాక బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల్లో ఆద‌ర్శ్ మిన‌హా అంద‌రిపైనా తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఎలిమినేట్ అయిన సెల‌బ్రిటీల‌కు భిన్నంగా దీక్ష వ్య‌వ‌హ‌రించార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. తాజాగా ఒక ప్ర‌ముఖ ఛాన‌ల్‌కు ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా మ‌రోసారి బిగ్ బాస్ కార్య‌క్ర‌మంపై ఆమె సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఈ షోలో పాల్గొన్న వారిలో ఎవ‌రూ చేయ‌ని వ్యాఖ్య‌లు ఆమె నోటి నుంచి రావ‌టం విశేషం. బిగ్ బాస్ ఇంట్లో ఉన్న‌న్ని రోజు చాలా బాగుంద‌ని.. మ‌ళ్లీ కొత్త ప్ర‌పంచంలోకి వ‌చ్చిన‌ట్లుగా ఉంద‌న్న ఆమె.. ఇప్పుడిప్పుడే తాను ఆ మూడ్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్న‌ట్లు పేర్కొన్నారు.

షో నుంచి ఎలిమినేట్ అయినందుకు ఎలాంటి ఫీలింగ్ లేద‌న్న ఆమె.. బిగ్ బాస్ షోలో త‌న‌కు తెలిసిన వారి కంటే తెలియ‌ని వారే ఎక్కువ‌మంది ఉన్నార‌న్నారు. త‌న‌ను విమ‌ర్శించ‌టం కొంచెం బాధ‌గా ఉంద‌న్న ఆమె.. ధ‌న‌రాజ్ వ్య‌వ‌హారం త‌న‌కు న‌చ్చ‌లేద‌న్నారు. కమెడియన్ ధన్ రాజ్ గతంలో సినిమా షూటింగ్ టైంలో తనతో మిస్ బిహేవ్ చేయడానికి ప్రయత్నించాడని.. అందుకే అతడితో సన్నిహితంగా ఉండలేకపోయానని ఆరోపించింది

మంచిగా ఉన్న‌ది కూడా కాస్త బ్యాడ్ గా చూపిస్తున్నార‌ని.. చాలాచోట్ల త‌న ఫెర్పామ్మెన్స్ ను త‌ప్పుగా చూపించార‌న్న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు. అంద‌రితో పాటు కాకుండా త‌న‌కు ఆక‌లి వేసిన‌ప్పుడు మాత్ర‌మే తాను తినేదాన్ని అని.. త‌న‌ది నైట్ వ‌ర్క్ అని ఏ రోజు త‌న వ‌ర్క్ కు సంబంధించి టీవీలో చూపించ‌లేద‌న్నారు. ఏదైనా డిస్క‌ర్ష‌న్ జ‌రిగితేనే టీవీలో చేపిస్తార‌న్న విష‌యం త‌న‌కు బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాతే తెలిసింద‌న్నారు.

తాను చేసిన మంచిప‌నుల్ని చూపించ‌లేద‌ని.. కేవ‌లం తాను తినేది మాత్ర‌మే చూపించార‌న్నారు. బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌పైనా ఆమె మ‌రోసారి విమ‌ర్శించారు. తాను హౌస్‌లోకి వెళ్లిన ద‌గ్గ‌ర నుంచి గొడ‌వ‌లు ప్రారంభించింద‌న్నారు. అర్చ‌న వైఖ‌రికి తాను షాక్ తిన్నట్లు చెప్పారు. ప్ర‌తి విష‌యంలోనూ అర్చ‌న త‌న‌తో గొడ‌వ పెట్టుకునేద‌ని.. త‌న‌తో మాత్ర‌మే కాద‌ని మ‌ధుప్రియ‌.. జ్యోతి.. కార్తిక‌..క‌ల్ప‌న‌ల‌తో కూడా గొడ‌వ పెట్టుకునేద‌న్నారు.

తానేం మాట్లాడినా అర్చ‌న గొడ‌వ పెట్టుకునేద‌ని.. త‌న‌కు మాట్లాడే అవ‌కాశ‌మే ఇవ్వ‌లేద‌న్నారు. హ‌రిప్రియ మొద‌ట్లో బాగానే ఉన్నా త‌ర్వాత తను మారింద‌న్నారు. తాను స‌రిగా ప‌ని చేయ‌టం లేద‌ని అర్చ‌న అంద‌రికి చెప్పింద‌ని.. తాను కెప్టెన్ గా ఉన్న‌ప్పుడు చేసిన ప‌నిని టీవీలో చూపించ‌లేద‌న్నారు. మొత్తానికి షోలో పాల్గొన్న వారికి భిన్నంగా బిగ్ బాస్ పైనే నేరుగా విమ‌ర్శ‌లు చేసిన వ్య‌క్తిగా దీక్ష‌ను చెప్ప‌క త‌ప్ప‌దు.