Begin typing your search above and press return to search.

ఫోక‌స్‌: టాలీవుడ్‌ లో ఆ ఐదుగురు

By:  Tupaki Desk   |   6 Oct 2015 5:30 PM GMT
ఫోక‌స్‌: టాలీవుడ్‌ లో ఆ ఐదుగురు
X
టాలీవుడ్‌ లో ఓ ఐదుగురు కొత్త హీరోయిన్‌ ల గురించి ఇంట్రెస్టింగ్ డిష్క‌స‌న్ సాగుతోంది. ఈ భామ‌లంతా స‌రైన బ్యాక్‌ గ్రౌండ్ నుంచే న‌ట‌న‌లోకి వ‌చ్చారు. మోడ‌లింగ్ అనుభ‌వం ఉంది. కొంద‌రికి ఫ్యామిలీ బ్యాక్‌ గ్రౌండ్ ఉంది. కాబ‌ట్టి వీళ్లంతా ఫ్యూచ‌ర్‌ స్టార్స్‌ గా వెలిగిపోయే ఛాన్సుంద‌న్న అంచ‌నాలేస్తున్నారంతా. ఓ మారు ఆ ఐదుగురి గురించి తెలుసుకోవాల‌నుకుంటే..

స‌యేషా సైగ‌ల్ :

బాలీవుడ్ స్టార్స్ దిలీప్‌ కుమార్ - సైరాభాను ఫ్యామిలీ నుంచి వ‌స్తున్న స్టార్ స‌యేషా సైగ‌ల్‌. ప్రారంభ‌మే అక్కినేని న‌ట‌వార‌సుడు అఖిల్ స‌ర‌స‌న వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో అవ‌కాశం అందుకుని టాలీవుడ్‌ లో పాపుల‌ర్ అయిపోయింది. అంతా న‌టీనటులు ఉన్న కుటుంబం నుంచి వ‌చ్చింది కాబ‌ట్టి స‌యేషాలో స్వ‌త‌హాగానే న‌టి దాగి ఉంది. తొలి సినిమాతో విజ‌యం అందుకుని టాలీవుడ్‌ లో మ‌రిన్ని సినిమాలు చేయాల‌నుకుంటోంది. బాలీవుడ్‌ లో అజ‌య్ దేవ‌గ‌న్ స‌ర‌స‌న ఓ సినిమాలో న‌టిస్తోంది. తెలివిగా కెరీర్‌ ని ప్లాన్ చేసుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉంది.

ప్ర‌గ్య జైశ్వాల్ :

మిర్చిలాంటి కుర్రాడు చిత్రంతో టాలీవుడ్‌ లో అడుగుపెట్టింది. కంచె చిత్రంలో వ‌రుణ్‌ తేజ్ స‌ర‌స‌న నాయిక‌గా న‌టిస్తూ పాపుల‌ర్ అయ్యింది. బాలీవుడ్‌ లో టిటు ఎంబిఏ అనే చిత్రంలో న‌టించింది. మోడ‌లింగ్ అనుభ‌వం ఉంది. ఫెమినా మిస్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొంది. ర్యాంప్ వాక్ త‌న‌కి పెద్ద అస్సెట్‌. ఇప్ప‌టికే న‌టిగా ఓ రెండు సినిమాల అనుభ‌వం ఉంది కాబ‌ట్టి టాలీవుడ్‌ లో దూసుకుపోతుంద‌నే అంచ‌నాలేస్తున్నారు.

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్:

ప్రేమమ్ చిత్రంతో మ‌ల‌యాళంలో హిట్ అందుకుని తెలుగులో అడుగుపెడుతోంది. ఇక్క‌డ ప్రేమ‌మ్ రీమేక్‌ లో నాగ‌చైత‌న్య స‌రస‌న న‌టిస్తోంది. మ‌జ్ను అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాతో పాటు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అ .. ఆ అనే చిత్రంలోనూ నాయిక‌గా అవ‌కాశం అందుకుంది. ఆరంభ‌మే త్రివిక్ర‌మ్ అంత‌టి స్టార్ డైరెక్ట‌ర్ సినిమాలో న‌టిస్తోంది కాబ‌ట్టి ఈ అమ్మ‌డి క్రేజ్ అసాధార‌ణంగా ఉంటుంద‌ని అర్థ‌మ‌వుతోంది.

దిశా ప‌టానీ:

వ‌రుణ్‌ తేజ్ స‌ర‌స‌న లోఫ‌ర్ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. పూరి జ‌గ‌న్నాథ్ ఈ అమ్మ‌డిని తెలుగు తెర‌కి ప‌రిచ‌యం చేయ‌డం క‌లిసొచ్చే అంశం. నో సెక్స్ ప్లీజ్ అనే బాలీవుడ్ చిత్రంలో న‌టించిన ఈ అమ్మ‌డికి అటు బాలీవుడ్‌, ఇటు టాలీవుడ్‌ లో ఛాన్సులొస్తున్నాయి. మోడ‌లింగ్‌ - ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న అనుభ‌వం ఉంది. ఇవ‌న్నీ త‌న‌కి అస్సెట్స్‌.

నీహారిక‌:

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌య‌గా బైటి ప్ర‌పంచానికి సుప‌రిచితం. మొద‌ట టీవీ యాంక‌ర్‌ గా - హోస్ట్‌ గా పాపుల‌ర్ అయిన నీహారిక ఇప్పుడు వెండితెర‌పై వెలుగులు విర‌జిమ్మేందుకు వ‌స్తోంది. నాగ‌శౌర్య‌తో ఒక మ‌న‌సు అనే చిత్రంలో నాయిక‌గా న‌టిస్తోంది. త‌మిళంలోనూ ఓ సినిమాకి క‌మిటైంద‌ని వార్త‌లొచ్చాయి. ఇంత పెద్ద ఫ్యామిలీ నుంచి వ‌స్తోంది కాబ‌ట్టి నీహారిక కెరీర్‌ కి ఏ ఢోఖా ఉండ‌దు. న‌టిగా నిరూపించుకుంటే చాలు శ్రుతిహాస‌న్ అంత భ‌విష్య‌త్ ఉంటుంది.