Begin typing your search above and press return to search.

కామ్రేడ్ లెంగ్త్ లాక్ అయ్యింది!

By:  Tupaki Desk   |   20 July 2019 4:19 AM GMT
కామ్రేడ్ లెంగ్త్ లాక్ అయ్యింది!
X
వచ్చే శుక్రవారం విడుదల కానున్న డియర్ కామ్రేడ్ మీద అంచనాలు మెల్లగా ఎగబాకుతున్నాయి. ఏడు నెలల గ్యాప్ తర్వాత వస్తున్న విజయ్ దేవరకొండ సినిమా కావడంతో అభిమానులు దీని గురించి చాలా ఆశలు పెట్టుకున్నారు. గీత గోవిందం తర్వాత ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ విజయ్ కు అందలేదు. నోటా డిజాస్టర్ కాగా టాక్సీ వాలా కమర్షియల్ గా సేఫ్ అయ్యిందే తప్ప రికార్డులు నెలకొల్పేంత సీన్ లేకపోయింది. అందుకే అర్జున్ రెడ్డి రేంజ్ లో సౌండింగ్ దీంతో వినిపించాలని వాళ్ళ నమ్మకం.

ఇదిలా ఉండగా సెన్సార్ కోసం వెళ్లిన డియర్ కామ్రేడ్ యు/ ఎ తెచ్చేసుకుంది. అంటే కొంత బోల్డ్ లేదా వైల్డ్ కంటెంట్ ఉందనే కదా. అదేమీ పెద్ద విషయం కాదు కానీ కామ్రేడ్ లెన్త్ ఏకంగా 2 గంటల 50 నిమిషాలకు లాక్ చేయడం అందరికి షాక్ కలిగిస్తోంది. ఈ మధ్య కాలంలో ఇంత డ్యూరేషన్ ఉన్న క్రేజీ మూవీ ఏదీ లేదు. కాలేజీ పాలిటిక్స్ బ్యాక్ డ్రాప్ లో ఓ లక్ష్యం కోసం పోరాటం చేసే పాత్రలో విజయ్ దేవరకొండ కామ్రేడ్ గా నటించిన ఈ మూవీ ఇంత నిడివి ఉండటం ఆశ్చర్యమే. అర్జున్ రెడ్డి మూడు గంటలు ఉన్నా విపరీతమైన ఆదరణ దక్కింది.

రంగస్థలం-మహానటి-మహర్షి ఇవన్నీ ఇంచుమించు కామ్రేడ్ లెన్త్ తో ఉండి సక్సెస్ అయినవే. ఆ నమ్మకంతోనే ఇంత డ్యూరేషన్ కి రెడీ అయ్యారేమో సినిమా వచ్చాక కానీ తెలియదు. నిన్న జరిగిన మ్యూజిక్ ఫెస్టివల్ లో విజయ్ దేవరకొండ రష్మిక మందన్న ఇద్దరూ కలిసి ఆడిపాడటం ఈవెంట్ లో ఓ రేంజ్ లో రచ్చ చేయడం హైప్ ని పెంచేసింది. సో కామ్రేడ్ లో చాలా బలమైన సాలిడ్ కంటెంట్ ఉంటేనే ఇంత నిడివిని ప్రేక్షకులు ఒప్పుకుంటారు. అది తేలాలంటే ఇంకో ఆరు రోజులు ఆగాల్సిందే.