Begin typing your search above and press return to search.

కంగారూతో సుమ స్క్రీన్ షేరింగ్

By:  Tupaki Desk   |   20 March 2019 4:50 AM GMT
కంగారూతో సుమ స్క్రీన్ షేరింగ్
X
సీనియ‌ర్ యాంక‌ర్ సుమ క‌న‌కాల ఏం చేసినా సంథింగ్ స్పెష‌ల్ గానే ఉంటుంది. మ‌ల్లూ గాళ్ అయినా టాలీవుడ్ లో త‌న‌దైన హ‌వా సాగిస్తూ తెలుగ‌మ్మాయిల‌కు సైతం స్ఫూర్తిగా నిలిచింది. యాంక‌ర్లు ఎంద‌రు ఉన్నా అందులో స్పెషాలిటీ ఉన్న యాంక‌ర్ గా ఇప్ప‌టికీ త‌న స‌త్తా చాటుతూనే ఉంది సుమ. టైమింగ్ తెలిసిన బెస్ట్ హోస్ట్ గా పాపులారిటీ ద‌క్కించుకుని ఈవెంట్ కి రూ.2-5 ల‌క్ష‌ల మ‌ధ్య ఆర్జించే టాప్ రేంజ్ యాంక‌ర్ గా పేరు తెచ్చుకుంది. ఏవీల పేరుతో టార్చ‌ర్ పెట్టే ఆడియో - ప్రీరిలీజ్ లు బోర్ కొట్టినా సుమ యాంక‌రింగ్ మాత్రం బోర్ కొట్ట‌దు అన్నంత‌గా పాపులారిటీ త‌న‌కు ఉంది.

అంత క్రేజీ యాంక‌ర్ తాజాగా మ‌రో క్రేజీ ఆఫ‌ర్ ని అందుకోవ‌డం ఫిలింన‌గ‌ర్ లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. ప్రఖ్యాత క్రికెట్ ప్లేయ‌ర్ .. కంగారూ దేశానికి చెందిన హార్డ్ హిట్ట‌ర్ డేవిడ్ వార్న‌ర్ తో క‌లిసి ఓ వాణిజ్య ప్ర‌క‌న‌ట‌న‌లో న‌టిస్తున్నారు సుమ‌. తెనాలి డ‌బుల్ హార్స్ మిన‌ప గుండ్లు - స‌రిక‌త్త టీవీసీ ప్ర‌క‌ట‌న‌ల్లో సుమ న‌టిస్తున్నారు. ఇందులో ఆస్ట్రేలియ‌న్ క్రికెట‌ర్ వార్న‌ర్ తో క‌లిసి స్క్రీన్ ని షేర్ చేసుకుంటున్నారు. ఇదిగో ఈ ఫోటో చూస్తే కంగారూనే కంగారు పెట్టించేస్తోందా.. అన్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు. ప్ర‌స్తుతం వార్న‌ర్ స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ టీమ్ త‌ర‌పున ఆడుతున్న సంగ‌తి తెలిసిందే. ఈనెల 23 నుంచి ఐపీఎల్ (ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్) 12 వ టోర్న‌మెంట్ మొద‌లు కానుంది.

ఇక ఐపీఎల్ ఫ్రాంఛైజీల పుణ్య‌మా అని ఈ క్రికెట‌ర్లు స్టార్ల‌తో చెట్టాప‌ట్టాల్ అంటూ వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించేస్తున్నారు. త‌ద్వారా అద‌న‌పు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఈ ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించినందుకు వార్న‌ర్ ఎంత తీసుకుంటున్నాడో? మ‌రి యాంక‌ర్ సుమ ఎంత పెద్ద మొత్తం ఛార్జ్ చేశారో తెలియాల్సి ఉందింకా. ప్ర‌స్తుతం ఈ అరుదైన ఫోటో యువ‌త‌రం సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతోంది.