చిరు మార్చాడా? వీళ్ళు మారిపోయారా??

Tue Jan 10 2017 22:50:16 GMT+0530 (IST)

మెగాస్టార్ మెగా మేనియా రెండు తెలుగు రాష్ట్రాల్లో పాకిపోయింది. థియేటర్లలో తమ మాస్ బాస్ ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు. ఖైదీ నంబర్ 150 విజయానికి ఇది నాంది అయితే.. మరికొన్ని విషయాల్లోనూ ఖైదీ కొత్త సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్నాడు.

రాజకీయ ప్రత్యర్ధులను కూడా తన మిత్రులుగాను.. సన్నిహితులు గాను మార్చేసుకుంటూ ఖైదీ నంబర్ 150కోసం అవలంబిస్తున్న వ్యూహం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మెగాస్టార్ కు పొలిటికల్ ప్రత్యర్ధులు అంటే దాసరి.. రోజాలను మొదటగా చెప్పుకోవాలి. మాటలతో నేరుపై ఆయనపై దాడి చేసేవాళ్లు వీళ్లే. కానీ మొన్న దాసరి నారాయణరావు.. ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. వీళ్లు పిలిచారు.. ఆయన వచ్చారు. తన వంతుగా మెగాస్టార్ ని విత్ ఫ్యామిలీతో సహా పొగిడేశారు.

ఇప్పుడు మరో పార్టీ నేత రోజా.. గతంలో చిరంజీవి పక్కన హీరోయిన్ గా కూడా నటించిన రోజా.. ఓ ఛానల్ కోసం యాంకర్ అవతారం ఎత్తిమరీ చిరును ఇంటర్వ్యూ చేయడం ఆశ్చర్యం కలిగించే విషయం. రాజకీయాల్లో చిరంజీవికి బీభత్సమైన ప్రత్యర్ధులుగా ఉంటూ.. చాలాసార్లు ఆయన రఫ్ఫాడించేశారు. వీరి మాటలతో తూట్లు పొడిచేశారు. కాని ఇప్పుడు సడన్ గా చిరంజీవికి వీరు బీభత్స మైన అభిమానులుగా మారిపోయి.. ఒకరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వస్తే.. ఇంకొకరు ఇంటర్యూ చేసేయడం చూస్తే.. మెగా కంబ్యాక్ ఏ రేంజ్ లో ఉండనుందో అర్ధమవుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/