Begin typing your search above and press return to search.

దాస‌రికి 135 అభిమాన సంఘాలున్నాయా?

By:  Tupaki Desk   |   25 April 2019 5:30 PM GMT
దాస‌రికి 135 అభిమాన సంఘాలున్నాయా?
X
ప‌రిశ్ర‌మ పెద్ద దిక్కు ద‌ర్శ‌క‌ర‌త్న డా.దాస‌రి నారాయ‌ణ‌రావు 2017లో స్వ‌ర్గ‌స్తులైన సంగ‌తి తెలిసిందే. భార‌త‌దేశం గ‌ర్వించ‌ద‌గ్గ ద‌ర్శ‌కుల్లో దాస‌రి నారాయ‌ణ‌రావు స్థానం సుస్థిరం. పాల‌కొల్లు లో జ‌న్మించి మ‌ద్రాసు ప‌రిశ్ర‌మ‌లో గొప్ప కీర్తిని ఘ‌డించిన ద‌ర్శ‌కుడాయ‌న. నాడు సూప‌ర్ స్టార్లు అంద‌రితో ప‌ని చేసిన రేర్ ట్యాలెంట్ ఆయ‌న సొంతం. అస‌లు అభిమాన సంఘాలు అంటే కేవ‌లం హీరోలు.. హీరోయిన్ల‌కు మాత్ర‌మేన‌ని అనుకునేవారంతా. అలాంటి టైమ్ లో ద‌ర్శ‌కుల‌కు కూడా అభిమాన సంఘాలు ఉంటాయి అని నిరూపించింది దాస‌రిగారే. మూడు ద‌శాబ్ధాల క్రితమే ఆయ‌న కోసం ద‌ర్శ‌క‌సంఘాలు ప్రారంభ‌మ‌య్యాయి. పాల‌కొల్లులో తొలి ద‌ర్శ‌క సంఘం ప్రారంభించారు. ఆ త‌ర్వాత అది చూసి ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా 135 అభిమాన సంఘాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఆ త‌ర్వాత ఇదే క‌ల్చ‌ర్ త‌మిళ‌నాడు- మ‌ద్రాస్ ప‌రిశ్ర‌మ‌కు వెళ్లింది.

తెలుగు వారు అయిన మ‌న దాస‌రికి అభిమాన సంఘాలు పెట్ట‌డంపై అక్క‌డ గొప్ప‌గా మాట్లాడుకునేవారు. ఆ త‌ర్వాతే అక్క‌డ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు బాల‌చంద‌ర్ కి అభిమాన‌లు సంఘాలు పెట్టారు. అందుకే బాల‌చంద‌ర్ హైద‌రాబాద్ కి వ‌చ్చిన‌ప్పుడు దాస‌రితో ఎంతో సాన్నిహిత్య ం కొన‌సాగించేవారు. ఏఎన్నార్ తో స‌మానంగా దాస‌రికి గౌర‌వం ద‌క్కింది అప్ప‌ట్లో. అస‌లు సినిమాకి కెప్టెన్ అంటే దాస‌రి గారే అని పిలిచే లెవ‌ల్ తెచ్చింది ఆయ‌న మాత్ర‌మే. కెవిరెడ్డి సినిమా ... విజ‌యావారి సినిమా అని అనేవారు అప్ప‌ట్లో. దాస‌రి వ‌చ్చాక ఇది ద‌ర్శ‌క‌శ‌కం... దాస‌రి శ‌కం అనేవారు. ఆ క్రెడిట్ తెచ్చిన తొలిత‌రం తెలుగు ద‌ర్శ‌కుడిగా ఆయ‌న పేరు మార్మోగింది.

ప్ర‌స్తుతం దాస‌రి పేరిట అవార్డులు టాలీవుడ్ లో చ‌ర్చ‌కు వ‌చ్చాయి. `దాసరి మెమోరియల్ ఫిల్మ్ అవార్డ్స్-2019` పేరుతో పుర‌స్కార‌ల్ని అందించేందుకు భీమవరం టాకీస్- భారత్ ఆర్ట్స్ అకాడమి సంయుక్తంగా ఓ వేడుక‌ను నిర్వ‌హిస్తోంది. మే 1న హైద‌రాబాద్ లో అతిరధ మహారధుల స‌మ‌క్షంలో ఈ వేడుక జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే దాసరి జీవిత సాఫల్య అవార్డును పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తికి.. దాసరి ఎక్స్ లెన్సీ అవార్డ్ పూరి జగన్నాథ్ కి.. దాసరి పద్మ & దాసరి నారాయణరావు అవార్డును జీవిత రాజశేఖర్ లకు ప్ర‌క‌టించారు. ఆస‌క్తిక‌రంగా దాసరి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ పుర‌స్కారాల‌కు ప‌లువురు ప్ర‌తిభావంతుల్ని ఎంపిక చేశారు. మహా వెంకటేష్, వేణు ఊడుగుల.. తిక్క శశి కిరణ్ లను ఎంపిక చేశారు. 24 శాఖల్లోనూ అవార్డులివ్వ‌నున్నారు. అయితే ఈ అవార్డులు ఇవ్వ‌డానికి మోటో దాస‌రి నారాయ‌ణ‌రావు గారు. ఆయ‌న అన్ని శాఖ‌ల్ని గౌర‌వించేవారు. అందుకే 24 శాఖ‌ల్లో 13 కీల‌క శాఖ‌ల ప్ర‌తిభావంతుల‌కు ఈ పుర‌స్కారాల్ని అందిస్తున్నామ‌ని అవార్డు క‌ర్త‌లు తెలిపారు. ఇవి క‌మ‌ర్షియ‌ల్ పర్ప‌స్ అవార్డులు కావు. చిన్న స్థాయి వారిని గుర్తించి ప్ర‌తిభ‌ను గౌర‌వించ‌డ‌మేన‌ని తెలుస్తోంది. క‌నీసం దాస‌రిని ఈ కోణంలో అయినా శిష్యులు గుర్తు చేసుకోవ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఈ వేడుక‌ల‌కు కొణిజేటి రోశ‌య్య ముఖ్య అతిధిగా విచ్చేస్తున్నారు.