Begin typing your search above and press return to search.

'ఆట‌గాళ్లు' భామ‌కు ఆ ముగ్గురంటే ఇష్ట‌మ‌ట‌!

By:  Tupaki Desk   |   21 Aug 2018 5:12 AM GMT
ఆట‌గాళ్లు భామ‌కు ఆ ముగ్గురంటే ఇష్ట‌మ‌ట‌!
X
మీకు న‌చ్చిన హీరో అన్న ప్ర‌శ్న‌కు ప‌లువురు హీరోయిన్లు చెప్పే స‌మాధానం.. సీనియ‌ర్ల పేర్లు చెప్పేయ‌టం. మ‌రి.. ఇప్ప‌టి హీరోల మాటేంటి? అంటే.. అంద‌రూ ఇష్ట‌మేనంటూ కొంద‌రు న‌వ్వేసి తెలివిగా స‌మాధానం ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తే.. మ‌రికొంద‌రు మాత్రం చాలా క‌ష్ట‌మైన ప్ర‌శ్న అంటూ కాస్త ఓపెన్ అవుతారు.

కానీ.. వీరంద‌రికి భిన్నంగా వ్య‌వ‌హ‌రించిందో బెంగాలీ ముద్దుగుమ్మ. తెలుగులో త‌న తొలి సినిమా విడుద‌ల కాక ముందే త‌న మాట‌ల‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్సించేలా చేసింది. నారా రోహిత్‌.. జ‌గ‌ప‌తి బాబులు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన ఆట‌గాళ్లు సినిమాలో ద‌ర్శ‌నా బానిక్ హీరోయిన్ గా న‌టిస్తున్నారు. ఈ వారం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుందీ సినిమా. ఇదిలా ఉంటే తాజాగా మాట్లాడిన బానిక్.. త‌న‌కు ముగ్గురు హీరోలంటే చాలా ఇష్ట‌మ‌ని ముద్దు ముద్దుగా చెప్పేసింది.

అందులో ఒక‌రు బాలీవుడ్ సూప‌ర్ స్టార్ షారుక్ ఖాన్ అయితే.. మ‌రో ఇద్ద‌రు మాత్రం ప్ర‌భాస్.. అల్లు అర్జున్ అని చెప్పేసింది. చేసిన ఒక్క సినిమా విడుద‌ల కాక ముందే.. త‌న‌కిష్ట‌మైన హీరోల పేర్ల‌ను ఓపెన్ గా చెప్పేసిన బానిక్ ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్పాలి.

మాట‌ల్లో మార్కులు కొట్టేసిన ఈ భామ‌.. మ‌రి న‌ట‌న‌తో ఎంత‌లా రాణిస్తుందో ఆట‌గాళ్ల సినిమా విడుద‌లైతే కానీ తెలీదు. అన్న‌ట్లు.. ఈ ముద్దుగుమ్మ బెంగాలీలో ఇప్ప‌టికే ఆరు సినిమాల‌తో పాటు.. ఒక వెబ్ సిరీస్ లోనూ న‌టించింద‌ట‌. బెంగాలీలో డ‌బ్ అయిన తెలుగు సినిమాల్ని తాను చూసిన‌ట్లుగా చెప్పింది. అందులో మ‌గ‌ధీర‌.. ఆర్య‌..ధృవ‌.. ఆరుంధ‌తి.. బాహుబ‌లి మూవీలు ఉన్నాయి. తెలుగు అర్థ‌మ‌వుతుంది కానీ.. మాట్లాడ‌లేన‌న్న ఈ భామ మ‌రో రెండు తెలుగు సినిమాలు చేస్తే.. తెలుగుదేముంది ఆటోమేటిక్ గా వ‌చ్చేస్తుంది.