Begin typing your search above and press return to search.

దర్శకుడిలో 'ఆ' మ్యాటర్ లేదా??

By:  Tupaki Desk   |   26 July 2017 3:46 PM GMT
దర్శకుడిలో ఆ మ్యాటర్ లేదా??
X
ఇప్పుడు ''దర్శకుడు'' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఒక సినిమా వస్తోంది. గతంలో పూరి జగన్ ఎంతో సీరియస్ గా తీసుకుని సినిమా ఇండస్ర్టీ బ్యాక్ డ్రాప్ లో ''నేనింతే'' అనే సినిమాను రూపొందించాడు. అయితే ఆ సినిమాలో కథ తక్కువా ఇండస్ర్టీ కష్టాలెక్కువ అన్న చందాన ఉండటంతో.. అప్పట్లో రిజల్ట్ తారుమారు అయిపోయింది. ఇప్పుడు మాత్రం సుకుమార్ ఈ సినిమా కథను కమర్షియల్ ఫార్మాట్లో చక్కగా రాశాడట. ఇకపోతే ఈరోజు జరిగిన ఈ సినిమా సెన్సార్ ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్.

నిజానికి ఈ సినిమా ప్రోమోలను చూస్తే.. ఈ సినిమాలో కాస్త ఎడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందనే అనిపించింది. అసలే సినిమా వారిపై సినిమా.. పైగా అసిస్టెంట్ డైరక్టర్ గా ఒక హీరోయిన్.. ఇక ఈ సినిమాలో డబుల్ మీనింగ్ పిజ్జాలకూ బర్గర్లకూ కొదవేం లేదు అనుకున్నారంతా. కాకపోతే ఈరోజు ఈ సినిమాకు ''యు'' సర్టిఫేక్ రావడం కాస్త షాకింగా ఉంది. ఎందుకంటే సుకుమార్ గతంలో కుమారి 21 ఎఫ్‌ రాసినట్లు ఈ సినిమాను రాసుంటే.. కఛ్చితంగా ఏ++ వచ్చుండేది. కాని ఇప్పుడు 'ఆ' పాళ్ళు బాగా తగ్గించి రాయడం వలన.. 'యు' వచ్చినట్లుంది.

సుకుమార్ అన్నయ్య కొడుకు అశోక్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతుండగా.. ఇక వరంగల్ బ్యూటి ఈషా ఈ సినిమాతో మరోసారి హీరోయిన్ గా తన లక్ చెక్ చేసుకుంటోంది. ఈమెను చూస్తుంటే కుమారి 21 ఎఫ్‌ తో హెబ్బా పటేల్ క్రియేట్ చేసినంత రచ్చ చేయకపోవచ్చు కాని.. తనదైన శైలిలో యాక్టింగ్ తో ఏమన్నా ఇంప్రెస్ చేస్తుందేమో చూడాలి. ఆగస్టు 4న దర్శకుడు రిలీజ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి.