Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: దంగల్ దుమ్ము లేపేసింది

By:  Tupaki Desk   |   20 Oct 2016 8:11 AM GMT
ట్రైలర్ టాక్: దంగల్ దుమ్ము లేపేసింది
X
ప్రముఖ కుస్తీ యోధుడు.. తన కూతుళ్లకు తానే ట్రైనింగ్ ఇచ్చి వారితో గోల్డ్ మెడల్స్ గెలిపించిన కోచ్.. మహవీర్ సిగ్ ఫోగట్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా ''దంగల్''. మిష్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ఇప్పుడు మహవీర్ సింగ్ పాత్రలో మెరుస్తున్న ఈ సినిమా కోసం చాలానే కష్టపడ్డాడు. యంగ్ పాత్ర కోసం వెయిట్ తగ్గి.. మళ్లీ కూతుళ్లకు ట్రైనింగ్ ఇచ్చే టైమ్ కోసం వెయిట్ తగ్గి.. విడతల వారీగా షూటింగ్ చేశాడు. డిసెంబర్ 23న రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలైంది.

ఆల్రెడీ సల్మాన్ ఖాన్ ''సుల్తాన్'' సినిమాను చూసినోళ్లందరికీ.. ఈ సినిమాలోని విజువల్స్ బాగా పరిచయం ఉన్నట్లు అనిపించవచ్చు కాని.. సినిమా కథ మాత్రం అదిరిపోయింది. తాను కేవలం ఒక చిన్న మెడల్ తో సరిపెట్టుకున్న ఒక తండ్రి.. తన కొడుకును పెద్ద వ్రెజ్లర్ చేయాలని అనుకుంటాడు. కాని కూతుళ్లు పుడతారు. తన ఆశలన్నీ అడియాశలే అయిపోయాయ్ అనుకుంటే.. ఆ కూతుళ్లలో స్పార్క్ ను గమనిస్తాడు తండ్రి. అక్కడ నుండి వారిని ఎలా నడిపించి వారితో మెడల్స్ గెలిపించాడు అనేదే సినిమా. అమీర్ ఖాన్ ట్రాన్సర్మేషన్ అదరిపోయింది. ఇతర నటీనటులు అందరూ కూడా బాగా చేశారు.

దర్శకుడు నితేష్‌ తివారి సినిమాను తీర్చిదిద్దన తీరు.. ట్రైలర్ చూస్తే అర్ధమైపోతుంది. అలాగే సేతు సినిమాటోగ్రాఫీ.. ప్రీతమ్ మ్యూజిక్ కూడా అదిరాయ్. చూస్తుంటే ''పీకె'' సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకుని వస్తున్న అమీర్.. ''దంగల్''తో దుమ్ములేపేస్తాడని అనిపిస్తోంది కదూ.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/