Begin typing your search above and press return to search.

మేకోవర్ చేశారట.. నమ్మేద్దామా!?

By:  Tupaki Desk   |   17 Feb 2017 12:32 PM GMT
మేకోవర్ చేశారట.. నమ్మేద్దామా!?
X
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ మూవీ దంగల్.. దాదాపు పాత రికార్డులన్నీ తుడిచిపెట్టేసిందనే చెప్పాలి. ఫైనల్ రన్ పూర్తయ్యేసరికి అత్యధిక వసూళ్లు సాధించి తన రికార్డును తానే బద్దలు కొట్టేసుకోవడం ఆమీర్ కి బాగా అలవాటయిపోయింది. అయితే.. దంగల్ మూవీతో మరో ఇద్దరు భామలకు కూడా బాగానే గుర్తింపు వచ్చింది.

ఆమిర్ ఖాన్ కూతుళ్లు గీతా ఫొగట్.. బబితా ఫొగట్ లుగా నటించిన సాన్యా మల్హోత్రా.. ఫాతిమా సనా షేక్ లకు క్రేజ్ బాగానే పెరిగింది. దంగల్ మూవీలో రెజ్లర్లుగా డీ గ్లామరైజ్డ్ రోల్స్ లోనే కనిపించిన వీళ్లిద్దరూ.. ఇప్పుడు ఇమేజ్ మార్చుకునే పనిలో పడ్డారు. ఇంకా అదే టైపులో ఉండిపోతే.. జరిగే డ్యామేజ్ ఏంటో తెలుసు కాబట్టి.. మేకోవర్ చేసేసి పోజులు ఇచ్చేస్తున్నారు. ఫార్మల్ వేర్ తో హెయిర్ స్టైల్ కూడా మార్చి బాగానే ట్రై చేస్తున్నారు ఈ కుర్ర బ్యూటీస్.

మేకోవర్ చేసేశాం చూడండహో అన్నట్లుగా ఉన్న ఈ ఫోటో షూట్ లో సాన్యా.. ఫాతిమాలను చూస్తే.. దంగల్ లో చూసినట్లుగానే ఉంది తప్ప.. కొత్తగా మేకోవర్ చేసేసినట్లుగా అనిపించడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మేకోవర్ అంటే.. డ్రస్సులు మారిస్తే సరిపోదంటూ కొంతమంది హితబోధ కూడా చేసేస్తున్నారు. హెయిర్ స్టైల్ మార్చడమే మారిపోవడం అనుకుంటే ఎలా.. దానికి చాలా కష్టపడాలి దంగల్ బేబీస్! ఇంకా టైం పడుతుందిలే!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/