ఆ మర్డర్ల సినిమా మళ్ళీ వస్తోంది

Fri May 19 2017 12:06:35 GMT+0530 (IST)

కన్నడలో భారీ హిట్ సాధించిన దండుపాళ్య చిత్రాన్ని తెలుగులోను దండుపాళ్యం పేరుతో అనువదించారు. ఇక్కడ కూడా ఘనవిజయం సాధించిన ఈ క్రైమ్ స్టోరీకి.. ఇప్పుడు సీక్వెల్ సిద్ధమైపోయింది. దండుపాళ్యం2 అంటూ సీక్వెల్ ని సిద్ధం చేసేశారు.

తొలి భాగాన్ని తీసిన దర్శకుడు శ్రీనివాసరాజు.. రెండో భాగం కూడా తెరకెక్కించాడు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. దండుపాళ్యం చిత్రంలో వయొలెన్స్ శృతి మించిందని.. ఇంటిమేట్ సన్నివేశాలను మరీ క్రూరంగా తీశారని.. హీరోయిన్ పూజా గాంధీని టాప్ లెస్ గా చూపించారని.. ఇలా ఎన్ని రకాల వివాదాలు ఉన్నా.. సినిమా మాత్రం సూపర్బ్ గా ఆడేసింది. పూజా గాంధీ సారధ్యంలో 9 మంది విలన్ గ్యాంగ్ అకృత్యాలు.. కేసు ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ గా బొమ్మాళి రవి శంకర్ లు నటన అందరినీ అలరించాయి. బాక్సాఫీస్ ని షేక్ చేశాయి.

తొలి భాగానికి మించి దండుపాళ్యం2 ఉంటుందని అంటున్నాడు నిర్మాత వెంకట్. దర్శకుడు శ్రీనివాసరాజు తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉంటుందని.. అందరినీ మెప్పిస్తుందని చెబుతున్నాడు. తెలుగు కన్నడ భాషల్లో ఒకే సమయంలో రిలీజ్ కానున్న దండుపాళ్యం2 మూవీలో.. పూజా గాంధీ.. రవిశంకర్.. రఘు ముఖర్జీ.. సంజన..  భాగ్యశ్రీలు కీలకపాత్రల్లో నటించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/