Begin typing your search above and press return to search.

పూజకి బలవంతంగా మహిళ లిప్ కిస్

By:  Tupaki Desk   |   27 Jun 2017 4:42 AM GMT
పూజకి బలవంతంగా మహిళ లిప్ కిస్
X
లిప్ కిస్ లు ఇప్పుడు సినిమాల్లో కామన్ అయిపోయాయి. కొందరు వీటిని క్లాస్ గా చూపిస్తుంటే.. మరికొందరు సినిమాకు అవసరం అనో.. అవసరం అయేట్లుగా సీన్ ను క్రియేట్ చేసో.. వీటిని ఇరికిస్తున్నారు. హీరో హీరోయిన్లతో ఇలాంటి మూతి ముద్దుల సీన్స్ చాలానే వస్తున్నాయి. జనాల నుంచి సెన్సార్ వరకూ వీటికి అలవాటు పడిపోయారు కూడా.

అయితే.. ఇద్దరు మహిళతో ముద్దు పెట్టించే ధైర్యం మాత్రం అందరు మేకర్స్ చేయలేరు. హింస-పైశాచిక శృంగారం వంటి వాటిని విపరీతంగా దట్టించిన దండుపాళ్యం ఐదేళ్ల క్రితం రిలీజ్ అయి సంచలనం సృష్టించింది. ఇప్పటికే దండుపాళ్యం-2కు కూడా ట్రైలర్ ఇచ్చేశారు. ఇప్పుడు మూవీపై మరింతగా బజ్ పెంచడానికి.. మేకింగ్ వీడియోస్ విడుదల చేస్తున్నారు. ఇందులో ఇద్దరు మహిళలు సెల్ లో ఉండగా.. ఒక పాత్రధారి పూజాగాంధీ కి బలవంతంగా మూతి ముద్దు పెట్టే సన్నివేశాన్ని విడుదల చేశారు. పైగా ఈ సీన్లో పూజా అండ్ మరోనటి పెర్ఫార్మెన్స్ కూడా షాకింగ్ అనే చెప్పాలి.

సహజంగా ఇలాంటి షాట్స్ తీసేటపుడు.. ముద్దు పెట్టినట్లు అనిపించేలా వెనక నుంచి తీయడం ఆనవాయితీ. వీటినే చీటింగ్ షాట్స్ అంటారు. కానీ దండుపాళ్యం2 కోసం మాత్రం.. పక్కనుంచి ఈ షాట్ తీస్తూ.. డైరెక్టుగానే లిప్ లాక్ సన్నివేశాన్ని పిక్చరైజ్ చేశారు. మేకింగ్ లోనే ఈ సినిమా ఇంత రచ్చ చేస్తుంటే.. ఇక సినిమా ఎలా ఉంటుందో.. 'ఎ' సర్టిఫికేట్ ఖాయమే అయినా.. ఎన్ని సన్నివేశాలకు కత్తెర పడతాయో చూడాలి.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/