డ్యాన్సింగ్ అంకుల్ లక్ మామూలుగా లేదు

Tue Jun 12 2018 09:53:59 GMT+0530 (IST)

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏదైనా వైరల్ అయితే క్షణాల్లో లక్షలాది మందికి చేరిపోతుంది. ఒకోసారి ఓవర్ నైట్ పాపులారిటీ కూడా వచ్చేస్తుంది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ కు చెందిన ప్రొఫెసర్ సంజీవ్ శ్రీవాస్తవ్ విషయంలో ఇదే జరిగింది. ఒక పెళ్లి వేడుకలో స్టేజీపై ఆయన వేసిన స్టెప్పులు మోస్ట్ వైరల్ గా మారాయి. 1987లో వచ్చిన హిందీ మూవీ ఖుద్ గర్జ్ లోని ‘ఆప్ కే ఆ జానే సే...' పాటకు హీరో గోవిందాను తలదన్నేలా వేసిన స్టెప్పులు చూసినవారంతా తెగ ఫిదా అయిపోయారు. నెటిజన్లంతా ఆయనకు డాన్సింగ్ అంకుల్ అని బిరుదు కూడా ఇచ్చేశారు.ఈ వీడియో సామాన్యులనుతోపాటు సెలబ్రిటీలను సైతం తెగ ఇంప్రెస్ చేసేసింది.  దీంతో డ్యాన్సింగ్ అంకుల్ ఏకంగా సల్మాన్ ఖాన్ ను కలవగలిగాడు. సోనీటీవీలో సల్మాన్ హోస్ట్ గా చేస్తున్న 'దస్ కా దమ్3' షో లో సంజీవ్ తన ఫ్యామిలీతో సహా కనిపించబోతున్నాడు. దీనికి సంబంధించి టీజర్ విడుదలైంది. ఈ విషయం స్వయంగా సంజీవ్ శ్రీవాస్తవ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ఈ టైంలో తన ఫీలింగ్ మిక్స్ డ్ గా ఉందని.. ఓ పక్క ఎగ్జయిటింగ్ గా.. మరోపక్క నెర్వస్ గానూ’ ఉందని నిజాయతీగా కామెంట్ పెట్టేశారు.

సంజీవ్ డ్యాన్స్ సెలబ్రిటీలకు బాగానే నచ్చింది. ఆయన డ్యాన్స్ కూడా హీరో గోవిందా కూడా మెచ్చుకున్నాడు. ఏదో  డాన్స్ చేయాలన్నట్లుగా కాకుండా పూర్తిగా లీనమై స్టెప్పులు వేశారంటూ ప్రశంసించాడు. సునీల్ శెట్టి అయితే తప్పకుండా ఓ సినిమా ఛాన్స్ ఇస్తానని ప్రామిస్ కూడా చేసేశాడు. ఆల్రెడీ బజాజ్ కంపెనీ ఆయనతో ఓ యాడ్ షూట్ చేసింది.