Begin typing your search above and press return to search.

తను చనిపోతే హీరోని కాడి మోయమంది

By:  Tupaki Desk   |   5 May 2016 1:30 PM GMT
తను చనిపోతే హీరోని కాడి మోయమంది
X
సరబ్ జిత్ అంటూ రియల్ లైఫ్ స్టోరీతో ఓ సినిమా థియేటర్లలోకి రానుంది. మే 20న విడుదల ఈ చిత్రం విడుదల కానుండగా.. ఇందులో రణ్ దీప్ హుడా, ఐశ్వర్యా రాయ్ లు నటించారు. పాకిస్తాన్ జైల్ లో మగ్గి చనిపోయిన ఓ వ్యక్తి జీవితమే ఈ సరబ్ జీత్. నిజ జీవిత గాధను అంతే రియలిస్టిక్ గా తెరకెక్కించగా.. సరబ్ జిత్ సోదరి పాత్రను ఐశ్వర్యారాయ్ పోషించింది. సరబ్ జిత్ సోదరి పేరు దల్బీర్.

ఈ సినిమా చూస్తుంటే.. తన సోదరుడు సరబ్ జిత్ ను చూసినట్లు ఉందని కంటతడి పెట్టుకుంది దల్బీర్. 'నేను రణ్ దీప్ లో నిజమైన సరబ్ జిత్ ను చూశాను. నేను అతన్నుంచి ఓ వాగ్దానం కోరుకుంటున్నా. నేను చనిపోయాక.. నా శవాన్ని మోసేందుకు అతను ఓ భుజం ఇవ్వాలి. నా సోదరుడే నన్ను పంపిస్తున్నాడనే తృప్తి నాకు ఉంటుంది' అంటూ ఎమోషనల్ అయిపోయింది దల్బీర్. సరబ్ జిత్ మూడో వర్ధంతి సందర్భంగా సరబ్ జిత్ మూవీ యూనిట్ ఆమెతో కాసేపు గడిపింది. ఈ సమయంలో కొన్ని సంగతులను కూడా గుర్తు చేసుకుంది దల్బీర్.

అలాగే ఐశ్వర్యారాయ్ ను ఈ చిత్రానికి సంబంధించిన సీన్లలో చూసినపుడు.. తనను తనే చూసుకున్నట్లు అనిపించిందని.. ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలను ముందే చూశానని, ఐశ్వర్యను చూసి ఆశ్చర్యపోయానని చెప్పింది దల్బీర్.