Begin typing your search above and press return to search.

మంచ‌మ్మాయి కావాల‌నుకుంటే నేను త‌గిలాను

By:  Tupaki Desk   |   5 Sep 2015 12:55 PM GMT
మంచ‌మ్మాయి కావాల‌నుకుంటే నేను త‌గిలాను
X
తేజ దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'హోరా హోరి'. శ్రీ రంజిత్ మూవీస్ పతాకం పై దామోదర్ ప్రసాద్ నిర్మించారు. సెప్టెంబర్ 11న రిలీజ్‌. ఈ సందర్భం గా క‌థానాయిక ద‌క్ష సినిమా విశేషాల్ని వెల్ల‌డించింది. ముంబై టు హైద‌రాబాద్ ప‌య‌నం వెన‌క ఎన్నో గ‌మ్మ‌త్త‌యిన సంగ‌తుల్ని రివీల్ చేసింది.

వ్య‌క్తిగ‌త నేప‌థ్యం:

స్వ‌స్థ‌లం ముంబై. అక్క‌డే పుట్టి పెరిగాను. ప్రస్తుతం బెంగుళూరు లో బి.బి.ఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. చిన్నప్పటి నుంచి మోడలింగ్, యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. దాంతో సినిమాల్లో ప్రవెశించాను. దర్శకుడు తేజ ముందు ఈ సినిమా లో మరో అమ్మాయిని కథానాయికగా ఎంపిక చేశారు. షూట్‌ మొదలయ్యే ముందు ఇంకా మంచి అమ్మాయి అయితే బాగుంటుందని వెతుకుతున్నారు. ఆడిషన్స్ ఇచ్చాను. అయనకు నచ్చడం తో సెలెక్ట్ చేశారు.

మైథిలి హ్యాపీ గాళ్‌:

ఈ మూవీలో నా క్యారెక్ట‌ర్ పేరు మైథిలి. హ్యాపీ గాళ్‌. కొన్ని ఊహించ‌ని పరిస్థితుల వల్ల మానసికంగా కలత చెందుతుంది. దాంతో ఏదైనా ప్రశాంతం గా ఉండే ప్రదేశానికి తీసుకువెళ్ళమని డాక్ట‌ర్లు స‌జెస్ట్ చేస్తారు. అలా ఓ కొత్త ప్రదేశానికి వెళ్ళిన ఆ అమ్మాయికి హీరో పరిచయం అవుతాడు. పరిచయం కొద్ది రోజుల్లో ప్రేమగా మారుతుంది. తర్వాత ఏం జరుగుతుందనేదే 'హోరా హోరి చిత్రం.

ఛాన్స్ రాగానే ఎగిరి గంతేసా:

తేజ ముంబై లో చాలా ఫేమస్. బాజీ, గులాం ఇంకా ఎన్నో చిత్రాలకు ఛాయాగ్రాహ‌కుడుగా ప‌నిచేశారు. అయన దర్శకత్వం వహించిన నిజం చూశా. నాకు బాగా నచ్చింది. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం లో వ‌చ్చిన‌ మిగతా చిత్రాలన్నా ఇష్టమే. అందుకే ఆయ‌న దర్శకత్వంలో అవకాశం రాగానే వెంటనే ఓకే చెప్పేశా. నేను ల‌క్కీగాళ్ ఛాన్స్ ద‌క్కినందుకు.

ఆయ‌న స‌ర‌దా మ‌నిషండీ:

తేజ ఆన్‌ సెట్స్‌ చాలా హాయిగా, సరదా గా ఉంటారు. న‌టీన‌టుల నుంచి మంచి ఔట్ పుట్ తీసుకోవ‌డం కోస‌మే ఆయ‌న‌ కోప్పడేది. అదంతా సన్నివేశం బాగా రావడం కోసమే. మ‌న వైపు నుంచి ఎలాంటి లోటు లేకుండా వందశాతం బాగా నటిస్తే చాల‌నేది ఆయ‌న ఆలోచ‌న‌. సరిగా నటించకపోతే కోప్పడతారు. తేజ చెప్పింది చేశాను. ఆయ‌నే ఓ యూనివ‌ర్శిటీ కాబ‌ట్టి ప్ర‌త్యేకించి శిక్ష‌ణ అవ‌స‌రం ప‌డ‌లేదు.