Begin typing your search above and press return to search.

బాబు, కేసీఆర్ తో రానా ఫొటో హల్ చల్

By:  Tupaki Desk   |   24 Feb 2017 5:20 PM GMT
బాబు, కేసీఆర్ తో రానా ఫొటో హల్ చల్
X
కొన్ని చిత్రాలు చూస్తుంటే కాలం ఎంత గడిచినా వాటికి ఉన్న ప్రత్యేకత ఏ మాత్రం తగ్గలేదనిపిస్తుంటుంది. అలాంటిదే పై ఫొటో. ఈ ఫొటోలు ఉన్నవారంతా తమ తమ రంగాల్లో అగ్రస్థానంలో ఉన్న వారే కావడం గమనార్హం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ - తెలుగు నిర్మాతల్లో అగ్రగణ్యుడైన దగ్గుబాటి రామానాయడు - విక్టరీ వెంకటేశ్ - రానా ఈ చిత్రంలో ఉన్నారు. గతంలో జరిగిన ఓ కార్యక్రమం నాటిది ఈ ఫొటో.

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్లో కేసీఆర్ మంత్రిగా ఉన్నప్పటిది ఈ చిత్రం. రామానాయుడు స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి హోదాలో బాబు పాల్గొనగా కేసీఆర్ సైతం కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/