Begin typing your search above and press return to search.

RRR: 400 కోట్లు .. దేనికంత బ‌డ్జెట్?

By:  Tupaki Desk   |   15 March 2019 1:30 AM GMT
RRR: 400 కోట్లు .. దేనికంత బ‌డ్జెట్?
X
రామారావు- రామ్ చ‌ర‌ణ్‌- రాజ‌మౌళి కాంబినేష‌న్ ఆర్.ఆర్.ఆర్ కి సంబంధించిన ప్ర‌తి డీటెయిలింగ్ జ‌నంలోకి దూసుకెళ్లిపోయాయ్. ఆర్.ఆర్.ఆర్ ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకుంటున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాకి 350-400 కోట్ల బ‌డ్జెట్ ఎందుకు ఖ‌ర్చ‌వుతోంది? అంటే కొన్ని సందేహాలు వ్య‌క్త‌మవుతున్నాయి. ఈ సినిమా క‌థ అంత డిమాండ్ చేసిందా? విజువ‌ల్ గ్రాఫిక్స్ కే వంద‌ల కోట్లు ఖ‌ర్చు చేయ‌బోతున్నారా? అంటూ రంధ్రాన్వేష‌ణ సాగుతోంది.

క‌థ ప్ర‌కారం అంత ఖ‌ర్చు చేయాల‌నుకోవ‌డంలో ప్రాబిబిలిటీ ఎంత‌? అన్న‌ది విశ్లేషిస్తే.. ఈ సినిమా క‌థలో వార్ బ్యాక్ డ్రాప్ కి ఉన్న ఆస్కారం ఏమీ క‌నిపించ‌డం లేదు. బాహుబ‌లి త‌ర‌హాలో భారీ యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు, భారీ క్లైమాక్స్ కు ఆస్కారం ఉందా? అంటే అదేదీ క‌నిపించనే లేదు. ఇటు తెలంగాణ వీరుడు కొమురం భీమ్.. అటు ఆంధ్రా వీరుడు అల్లూరి సీతారామ‌రాజు ఈ ఇద్ద‌రూ ఆంగ్లేయుల‌పై ఎలాంటి పోరాటం సాగించారు? అన్న‌ది తెర‌పై చూపించ‌డం లేదు. అంటే ఆంగ్లేయుల‌కు ఎదురెళ్లి దెబ్బ తీసే వ్య‌వ‌హారాలు కానీ, యుద్ధానికి ఆస్కారం ఉన్న సంగ‌తుల్ని కానీ తెర‌పై చూపరు. ఆ ఇద్ద‌రూ వీరులు అవ్వ‌క ముందు ఏం చేశారు? వీరులు ఎలా అయ్యారు? అన్న‌ది మాత్ర‌మే చూపిస్తారు. అంటే కొమ‌రం భీమ్ , అల్లూరి సీతారామ‌రాజులో విప్ల‌వ భావాలు నాటుకునే ముందు .. ఫ్యామిలీ లైఫ్‌.. వాళ్లు త‌మ సొంత ప్లేసులో ఏం చేశారు? బాల్యం ఎక్క‌డ గ‌డిచింది? ఎలా గ‌డిచింది? అన్న‌ది చూపిస్తార‌న్న‌మాట‌. అంటే ఆ లైఫ్ లో భారీ వార్ లు జ‌ర‌గ‌డానికి ఆస్కారం క‌నిపించ‌డం లేదు. అయితే ఆ ఇద్ద‌రూ గిరి పుత్రులుగా అడ‌వుల్లో సంచ‌రించేప్పుడు ఆ అడ‌వుల్ని గ్రాఫిక్స్ లో అందంగా అద్భుతంగా చూపించేందుకు ఖ‌ర్చు అవుతుందన‌డంలో సందేహం లేదు. అయితే ఎంత ఖ‌ర్చు చేసినా బాహుబ‌లి క్లైమాక్స్ లా భారీ వార్ ఎపిసోడ్స్ కి పెట్టేంత ఏం ఉంటుంద‌న్న సందేహం అలానే ఉంది.

ఏదో మీడియా అడిగింది క‌దా అని దాన‌య్య బ‌డ్జెట్ గురించి ఓ మాట విసిరేసారా? లేక ఆ క‌థ‌లో అంత డెప్త్ ఉందా? అన్న‌ది ఆలోచించాలి. ఇక ఈ సినిమా క‌థ‌లో కొమురం భీమ్ కానీ, అల్లూరి సీతారామ‌రాజు కానీ వెప‌న్స్ ఏం వాడారు? అంటే భారీ వెప‌న్స్ ఏవీ వాడ‌లేదు. కేవ‌లం బాణాలు మాత్ర‌మే సంధించేవార‌ని చ‌రిత్ర చెబుతోంది. ఆంగ్లేయుల‌పై అల్లూరి, నైజాంపై కొమ‌రం భీమ్ పోరాడారు కానీ వీళ్లు ఎదురు తిరిగి క్రూర‌త్వం చూపించేందుకు భారీగా ఆయుధాలు వాడ‌లేదు. ఇక ఫిక్ష‌న్ క‌థాంశాన్ని జోడించి చూపిస్తున్నామ‌ని.. ఆ ఇద్ద‌రు వీరుల క‌థ‌లో ఫిక్ష‌న్ కీల‌క భూమిక పోషిస్తుంద‌ని జ‌క్క‌న్న చెప్పారు కాబ‌ట్టి ఆ ఫిక్ష‌న్ లో ఏం ఉంది? అన్న డైలెమా కొన‌సాగుతోంది. దానిపై క్లారిటీ వ‌స్తే కానీ అస‌లు 350-400 కోట్ల బ‌డ్జెట్ ఎందుకు ఖ‌ర్చ‌వుతుంది? అన్న‌ది అర్థం కాదు. 2020 జూలై 30 కోసం మెగా- నంద‌మూరి ఫ్యాన్స్ మాత్రం ఎగ్జ‌యిటింగ్ గానే వేచి చూస్తున్నారు. మునుముందు టీజ‌ర్లు, మేకింగ్ వీడియోలు, ట్రైల‌ర్ల‌తో వ‌స్తుందేమో క్లారిటీ.