Begin typing your search above and press return to search.

ఆర్పేయడం ఆపేయాలి బన్నీ!!

By:  Tupaki Desk   |   22 Jun 2017 12:25 PM GMT
ఆర్పేయడం ఆపేయాలి బన్నీ!!
X
అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన డీజే మూవీ.. ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అనడంలో సందేహం అక్కర్లేదు. ఎందుకంటే ఈ సినిమా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ చూసి ట్రేడ్ జనాలకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. థియేట్రికల్.. శాటిలైట్.. హిందీ డబ్బింగ్ ప్లస్ శాటిలైట్.. ఇలా అన్నీ కలుపుకుని 100 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ చేసిందట డీజే.

బన్నీ కెరీర్ లో ఒక సినిమా బిజినెస్ 100 కోట్లు దాటడం ఇదే మొదటిసారి. ఇంతగా బిజినెస్ పెరిగిపోవడానికి కారణం.. ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ అని తెలుస్తోంది. నటీనటుల నుంచి టెక్నీషియన్స్ వరకూ అందరూ కాస్ట్లీ జనాలను ఏరికోరి పట్టుకొచ్చారు. ముఖ్యంగా వరుస ఫ్లాపుల్లో ఉన్న పూజా హెగ్డేకు కూడా పెద్ద మొత్తమే ఇచ్చి తీసుకొచ్చారట. ఈమెకు ఏకంగా కోటిన్నర ముట్టచెప్పారనే న్యూస్ చాలా మందికి షాక్ కొట్టించేస్తోంది. డీజే మూవీలో కీలకమైన ఓ బికినీ సీన్ ఉంటుందట. కేవలం ఆ ఒక్క బికినీ సీన్లో యాక్ట్ చేసేందుకు ఒప్పించడం కోసం.. ఆమె ఈ స్థాయిలో డిమాండ్ చేసిందని అంటున్నారు.

మరోవైపు సినిమాటోగ్రాఫర్ అయానక బోస్ కూడా బాగా కాస్ట్లీ. దాదాపు రోజుకు లక్షన్నర పెట్టిమరీ ఇతడితో పని చేయించుకున్నారు. ఈ మూవీ కోసం 120 రోజులు పని చేశామని బన్నీ స్వయంగా చెప్పిన సంగతి వింటే.. సినిమాటోగ్రాఫర్ కే 1.80 కోట్ల రూపాయలు చెల్లించారని అర్ధమవుతుంది. బహుశా ఇదో పెద్ద రికార్డ్ కావచ్చు కూడా.

ఇవే కాకుండా.. అబుదాబిలో షూటింగ్ కు కూడా తడసిమోపెడు అయ్యిందట. అక్కడ 7 స్టార్ హోటల్స్ అనేది స్టార్టింగ్ రేంజ్. అంటే అక్కడ షెడ్యూల్ మొత్తానికి విపరీతంగా ఖర్చు చేయాల్సి వచ్చిందని టాక్. మొదటగా ఈ సినిమాను 40 కోట్లలో పూర్తి చేయాలని దిల్ రాజు భావిస్తే.. మూవీ పూర్తయే నాటికి డీజేను 75 కోట్ల సినిమా చేసారని రుమోర్స్ వస్తున్నాయి . అందుకే దిల్ రాజు ఈ సినిమాను 80 కోట్లకు అమ్మాడని అంటున్నారు. ఇంత మొత్తం రికవర్ చేయాలంటే.. ఇండస్ట్రీ హిట్ కొట్టాల్సిన పరిస్థితి. మరి డీజే ఆ రేంజ్ ను అందుకుంటుందో లేదో చూడాలి.