Begin typing your search above and press return to search.

తొలి రోజు డీజే దున్నుడు లెక్క ఇదే

By:  Tupaki Desk   |   24 Jun 2017 12:55 PM GMT
తొలి రోజు డీజే దున్నుడు లెక్క ఇదే
X
వరుస విజయాలతో.. టాలీవుడ్ లో ఏ హీరోకి లేనంత సక్సెస్ ట్రాక్ తో దూసుకుపోతున్న అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ డీజే- దువ్వాడ జగన్నాధం. ఈ మూవీపై ముందు నుంచి మంచి అంచనాలే ఉన్నా.. తొలి రోజు డివైడ్ టాక్ వచ్చింది. అయితే.. ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే.. అసలు ఈ టాక్ కి డీజే చూసే జనాలకు ఏ మాత్రం సంబంధం లేకుండా పోయిందనే సంగతి అర్ధమవుతుంది.

తన కెరీర్ లోనే బెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ ను రాబట్టాడు బన్నీ. అల్లు అర్జున్ కెరీర్ లో ఇప్పటివరకూ హైయెస్ట్ గ్రాసర్ అయిన సరైనోడుకు.. రెట్టింపు స్థాయిలో తొలి రోజు డీజే కలెక్షన్స్ ఉండడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఏపీ ప్లస్ నైజాంల నుంచి ఈ చిత్రానికి 18.36 కోట్ల రూపాయల షేర్ వసూలు కాగా.. గ్రాస్ 24 కోట్లను దాటింది. నైజాం ఏరియా నుంచి 4.95 కోట్లు.. సీడెట్ 2.7 కోట్లు.. ఉత్తరాంధ్ర 1.94 కోట్లు.. గుంటూరు 2.26 కోట్లు.. కృష్ణా 0.99 కోట్లు.. ఈస్ట్ 2.55 కోట్లు.. వెస్ట్ 2.08 కోట్లు.. నెల్లూరు నుంచి 0.86 కోట్ల షేర్ వసూలైంది.

రెండు తెలుగురాష్ట్రాల నుంచే 18.36 కోట్లు రాబట్టిన డీజేకు.. కర్నాటక నుంచి 2.96 కోట్లు.. యూఎస్ఏ నుంచి 1.58 కోట్లు.. రెస్టాఫ్ ఇండియా ప్లస్ రెస్టాఫ్ వరల్డ్ కలిపి 0.85 కోట్లు వచ్చాయి. మొత్తం మీద ఫస్ట్ వరల్డ్ వైడ్ షేర్ 23.75 కోట్ల రూపాయలు కాగా.. గ్రాస్ 33.9 కోట్లు. మొదటి రోజు టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో 7వ స్థానంలో నిలిచిన దువ్వాడ జగన్నాధం.. సౌతిండియన్ మూవీస్ లో 10వ స్థానంలో నిలిచింది. రెండో రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలవడంతో.. దువ్వాడ దున్నుడు మరికొన్ని రోజులు కంటిన్యూ అయే ఛాన్స్ కనిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/