Begin typing your search above and press return to search.

తమ్ముడికి బొమ్మరిల్లు చూపిస్తున్నాడు

By:  Tupaki Desk   |   4 May 2016 9:30 AM GMT
తమ్ముడికి బొమ్మరిల్లు చూపిస్తున్నాడు
X
తెలుగు సినీ పరిశ్రమలో దిల్ రాజు ఓ ట్యాలెంటెడ్ అండ్ బ్యాలెన్సెడ్ ప్రొడ్యూసర్. ఈయన నిర్మాణంలో వచ్చిన మూవీస్ లో.. బొమ్మరిల్లును ఓ ట్రెండ్ సెట్టర్ అనే చెప్పచ్చు. అన్నీ తనే చేసేస్తూ.. కుటుంబాన్ని చూసుకునే ప్రకాష్ రాజ్ పాత్రను.. ఇప్పుడు రియల్ లైఫ్ లో చేసేస్తున్నాడు దిల్ రాజు. ఏదైతే కరెక్ట్ కాదని తన సినిమాలో చెప్పాడో.. ఇప్పుడు దాన్ని తనే ఫాలో అయిపోతున్నాడని అనిపిస్తోంది.

సాయిధరం తేజ్ హీరోగా సుప్రీమ్ మూవీ మే 5న విడుదల అవుతోంది. ఈ మూవీకి పబ్లిసిటీలో భాగంగా.. ముందే టూర్లు చేసేస్తూ కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తోంది యూనిట్. కానీ ఎక్కడ చూసినా దిల్ రాజు హంగామానే కనిపిస్తోంది. నిజానికి సుప్రీమ్ మూవీకి దిల్ రాజు నిర్మాత కాదు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మాతగా తెరకెక్కింది ఈ చిత్రం. కానీ ఎక్కడా శిరీష్ హస్తం మాత్రం కనిపించడం లేదు.

ప్రమోషన్ టూర్స్ అంటూ థియేటర్స్ కి తనే వెళుతున్నాడు దిల్ రాజు. ప్రెస్ మీట్లు పెట్టినా హీరో - హీరోయిన్లతో పాటు తనే కనిపిస్తున్నాడు. ఇలా అన్నీ తనే చేసేసి, చివరకు సక్సెస్ క్రెడిట్ మాత్రం తమ్ముడి ఖాతాలో వేయాలన్నది ఈ బడా ప్రొడ్యూసర్ ప్లాన్. ఐడియా బాగానే ఉంది కానీ.. సినిమా హిట్టైతే పేరు రావచ్చేమో కానీ.. ఎక్స్ పీరియన్స్ రాదు కదా. ఈ చిన్న లాజిక్ దిల్ రాజు ఎలా మిస్ అయాడబ్బా!