సల్లూ లవర్ తో క్రికెటర్ ఆట!!

Fri Jan 12 2018 15:14:06 GMT+0530 (IST)

బాలీవుడ్ నటులకు క్రికెట్ తారలకు మధ్య బోలెడంత అనుబంధం కనిపిస్తూ ఉంటుంది. ఇమేజ్ లో ఒకరితో ఒకరు పడే ఈ రెండు రంగాలు.. ప్రొఫెషనల్ గా వైవిధ్యం కలిగి ఉన్నా.. రెండు రంగాల మధ్య అనుబంధాలు తెగ పెరిగిపోతున్నాయి. రీసెంట్ గా ఇండియన్ స్కిప్పర్ విరాట్ కోహ్లీ.. స్టార్ హీరోయిన్ అనుష్క శర్మను వివాహమాడిన సంగతి తెలిసిందే.సుదీర్ఘ కాలంగా ప్రేమించుకున్న విరుష్కలు.. ఎట్టకేలకు ఒక్కటయ్యారు. ఇప్పుడు ఇలాంటిదే మరో లవ్ ఎఫైర్ మొదలైందని బాలీవుడ్ గుసగుసలాడుకుంటోంది. యాక్ట్రెస్ ఎల్లి ఆరామ్ గురించి నేషనల్ మీడియా బాగానే ఫోకస్ చేసింది. బిగ్ బాస్ ద్వారా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామకు.. సల్మాన్ ఖాన్ తో కూడా లింకులు అంటగట్టేశారు. ఏకంగా కండలవీరుడి లవర్ అనే ప్రచారం లభించడంతో.. ఈమెకు అనతికాలంలోనే మాంచి డిమాండ్ ఏర్పడింది. ఇప్పుడీ భామ.. క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో చెట్టాపట్టాల్ వేసుకుని తిరగడం హాట్ టాపిక్ అవుతోంది. రీసెంట్ గా హార్దిక్ పాండ్యా సోదరుడి వివాహం జరిగింది.

ఈ పెళ్లిఫోటోలలో ఫెళ్లికొడుకు-పెళ్లికూతురుతో హార్దిక్ పాండ్యా-ఎల్లి ఆరామ్ దిగిన ఫోటోలను చూసిన జనాలకు డౌట్స్ వచ్చేస్తున్నాయి. పెళ్లిఫోటోల్లోనే కాదు హల్దీ-మెహందీ-సంగీత్ అన్ని కార్యక్రమాలను మిస్ చేయకుండా అటెండ్ అయిపోయింది ఎల్లి. అన్ని చోట్లా ఓ జంట మాదిరిగా కనిపించేశారు హార్దిక్-ఎల్లి ఆరామ్. ఇంతకీ హార్దిక్ పాండ్యా ఫ్యామిలీకి ఎల్లి ఆరామ్ ఇంత పర్సనల్ గా ఎప్పుడు క్లోజ్ అయిపోయిందో ఎవరికీ అంతు పట్టడం లేదు.