మరో క్రికెటర్-హీరోయిన్ ప్రేమ

Wed Jul 11 2018 11:41:06 GMT+0530 (IST)

మరో ప్రేమ చిగురించింది.. క్రికెటర్ హార్ధిక్ పాండ్య బాలీవుడ్ హీరోయిన్ ఈషా గుప్తాలు ప్రేమలో ఉన్నట్టు తేటతెల్లమైంది. సినిమా ఇండస్ట్రీకి క్రీడాకారులకు మధ్య ప్రేమలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇప్పటికే భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ ఫేమస్ యాక్టర్ అనుష్క శర్మతో ప్రేమలో పడి ఈ మధ్యే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. తాజాగా మరో క్రికెట్-సినీ లవర్స్ ఎఫైర్స్ బయటకు వచ్చింది.ప్రస్తుతం టీమిండియా క్రికెటర్ హార్ధిక్ ఇంగ్లండ్ పర్యటనలో బిజీగా ఉండగా.. ఈషా ‘పల్టన్’ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు.   ఈ క్రమంలోనే వీరి గురించి ఓ ఇంట్రస్టింగ్ విషయం లీక్ అయ్యింది.

తాజాగా టీమిండియా క్రికెటర్ హార్ధిక్ పాండ్యాతో బాలీవుడ్ నటి ఈషా గుప్తా ప్రేమాయణం బయటపడింది. వీరిద్దరూ సీక్రెట్ గా కలిసి తిరిగిన పలు ఫొటోలు లీక్ అయ్యాయి. ఇద్దరూ కలిసి డేటింగ్ లో ఉన్నట్టు సన్నిహితుల ద్వారా నిర్ధారణ అయ్యింది. ‘ప్రస్తుతం క్రికెటర్ హార్ధిక్ పాండ్యాతో ఈషా ప్రేమలో ఉంది.  చిలిపి పనులతో హార్ధిక ఈషా మనసు గెలుచుకుంటున్నాడు’ అని ఈషా సన్నిహితురాలు మీడియాకు లీక్ చేసింది.