మోస్ట్ అవైటెడ్ RRR బ్యూటీస్

Fri Jan 11 2019 11:17:48 GMT+0530 (IST)

మోస్ట్ అవైటెడ్ RRR బ్యూటీస్ ఎవరు? ప‌్రస్తుతం అభిమానుల్లో ఆసక్తికర చర్చ ఇది. ఎస్.ఎస్.రాజమౌళి ఈసారి ఎవరిని ఎంపిక  చేయబోతున్నారు?   బాహుబలి సిరీస్ కోసం అనుష్క - తమన్నా - మనోహరి త్రయం అంటూ అందగత్తెల వెంట పడ్డారు. ఈసారి ఎవరి వెంట పడబోతున్నారు? అంటూ యూత్ ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. ఈసారి మోస్ట్ అవైటెడ్ మూవీలో ఛాన్స్ దక్కించుకునే అందగత్తెలు ఎవరు అంటూ ఆరాలు మొదలయ్యాయి.అయితే అన్నిటికీ సాధ్యమైనంత తొందరగానే సమాధానమిస్తారట రాజమౌళి. ప్రస్తుతం సెర్చ్ సీరియస్ గా సాగుతోంది. ఈసారి ఎట్టి పరిస్థితిలో ఈ చిత్రం కోసం బాలీవుడ్ కథానాయికల్ని ఎంపిక చేసుకునేందుకే ప్రయత్నిస్తున్నారట. బాహుబలి సిరీస్ తర్వాత మారిన కాన్వాసులో అతడు తెరకెక్కించే సినిమాలన్నీ పాన్ ఇండియా బేస్ పైనే ఉంటాయి కాబట్టి అందుకు తగ్గట్టే ఇంటర్నేషనల్ అప్పీల్ ఉన్న నాయికల్ని ఎంపిక చేసుకోవాలన్నది ప్లాన్ అని తెలిసింది. ఇప్పటికే బాలీవుడ్ నాయికల పేర్ల జాబితా రాజమౌళి వద్ద సిద్ధంగా ఉందిట. ఇందులో దీపిక - కత్రిన - ఆలియాభట్ వంటి ప్రముఖ నాయికల పేర్లు ఈ లిస్ట్ లో ఉన్నాయని చెబుతున్నారు.

వీళ్లంతా ఇప్పటికే బిజీ స్టార్లు. జక్కన్నకు ఓకే చెప్పే నాయికలు ఎవరు? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్. దీపిక పెళ్లి తర్వాత పలు ప్రాజెక్టులకు ఆప్షన్ గా ఉన్నా ఇంతవరకూ వేటికీ సంతకాలు చేయలేదు. కత్రిన ఇప్పటికే బిజీ నాయిక. భరత్ అనే చిత్రం తర్వాత ఏ సినిమా చేస్తుంది? అన్నది తేలాల్సి ఉంది. ఆలియా రైజింగ్ గురించి చెప్పాల్సిన పనేలేదు. రాజమౌళి ప్రకటించే పేర్లు ఏవి? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్. ఇటీవల `కాఫీ విత్ కరణ్` షోలో ప్రస్థావించిన పేర్ల నుంచే రాజమౌళి నాయికల ఎంపిక జరగనుందా? అన్న సందేహాలు నెలకొన్నాయి. ఇప్పటికి ఇంకా ఇంకా సెర్చ్ కొనసాగుతోంది. సాధ్యమైనంత తొందర్లోనే నాయికల గురించి ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికి ఒక షెడ్యూల్ పూర్తయింది. రెండో షెడ్యూల్ చిత్రీకరణకు వెళ్లనున్నారు. ఇక ఈ చిత్రాన్ని ఆంగ్లేయుల బ్యాక్ డ్రాప్ లో హిస్టారికల్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. వర్తమానానికి కనెక్టివిటీ ఉంటుంది. అంటే అందుకు తగ్గట్టే నాయికల ఎంపిక ఉండబోతోంది. చరణ్ - తారక్ సరసన నటించే నాయికల జాబితాలో పలువురి పేర్లు వినిపించినా అవేవీ ఖరారు కాలేదు. ఇకపై ఆ లక్కీ గాళ్స్ ఎవరు? అన్నది వేచి చూడాల్సిందే.  డివివి దానయ్య ఈ చిత్రాన్ని దాదాపు 200కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.