Begin typing your search above and press return to search.

కళాభవన్ మణి కేసు: ఫ్రెండ్సుకు లై డిటెక్టర్ టెస్ట్

By:  Tupaki Desk   |   12 Feb 2019 12:40 PM GMT
కళాభవన్ మణి కేసు: ఫ్రెండ్సుకు లై డిటెక్టర్ టెస్ట్
X
ప్రముఖ మలయాళ నటుడు కళాభవన్ మణి 2016 లలో మరణించారు. మార్చ్ 4 న లివర్ సంబంధిత అనారోగ్యంతో ఆయనను కొచ్చిలో ఒక హాస్పిటల్ లో చేర్పించగా రెండు రోజుల అనంతరం మృతిచెందారు. 45 ఏళ్ళ మణి అనారోగ్యం బారిన పడిన సమయంలో చాలక్కుడిలో ఉన్న తన 30 ఎకరాల ఫాం హౌస్ లో ఒంటరిగా ఉన్నారట. ఫోరెన్సిక్ రిపోర్ట్ లో అయన శరీరంలో పురుగుమందు(క్లోరోపైరిఫాస్) అవశేషాలు ఉన్నాయని తేల్చడంతో అయన మరణాన్ని అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్నారు. పోలీసులు ఆ కేసులో ఎలాంటి పురోగతి సాధించలేకపోవడంతో ఆ కేసును సీబీఐకి అప్పగించారు.

ఈ కేసులో మణి స్నేహితులకు లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించాలని సిబీఐ వారు కోర్టును కోరారు. ఈ అభ్యర్థనను మన్నించిన ఎర్నాకుళం చీఫ్ జుడిషియల్ మేజిస్ట్రేట్ లై డిటెక్టర్ టెస్టుకు అనుమతినిచ్చారు. రూల్స్ ప్రకారం లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించాలంటే ఆ పరీక్షకు హాజరయ్యేవారు స్వచ్చందంగా ఒప్పుకోవలసిందే. అలా ఏడుమంది మణి స్నేహితులు లై డిటెక్టర్ టెస్ట్ కు అంగీకరించిన తర్వాతే ఎర్నాకులం కోర్టు సీబీఐ వారికి అనుమతినిచ్చారు.

మరి ఈ డెత్ కేసులో లై డిటెక్టర్ టెస్టులు జరిపిన తర్వాత ఎలాంటి ఫలితాలు వస్తాయో వేచి చూడాలి. మణి కుటుంబం చాలారోజుల నుండి ఈ కేసును త్వరగా ఒక కొలిక్కి తీసుకు రావాలని.. నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు.