Begin typing your search above and press return to search.

సైలెంట్ గా అరవిందకు కోత ?

By:  Tupaki Desk   |   23 May 2018 8:05 AM GMT
సైలెంట్ గా అరవిందకు కోత ?
X
జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపొందుతున్న క్రేజీ మూవీ అరవింద సమేత వీర రాఘవ ఫస్ట్ లుక్ బయటికి వచ్చాక హైప్ మెల్లగా బిల్డ్ అవుతోంది. సినిమా జానర్ గురించి మొన్నటి దాకా ఉన్న అనుమానాలు పటాపంచలు అయ్యాయి. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న మూవీ అనే క్లారిటీ వచ్చినట్టే. విశ్వసనీయమైన సమాచారం మేరకు దీని బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టు తెలిసింది. అజ్ఞాతవాసి విషయంలో కాస్ట్ కటింగ్ లో చేసిన తప్పుల వల్లే బడ్జెట్ అమాంతం పెరిగిపోయి బిజినెస్ కూడా విపరీతయమైన రేట్లకు అమ్మాల్సి రావడం వసూళ్ల పై చాలా ప్రభావం చూపింది. దాని ఫలితం హాసిని బ్యానర్ ఇమేజ్ ని కొంత మేర డ్యామేజ్ చేసిందన్న మాట నిజం. అందుకే నిర్మాత చినబాబు తారక్ సినిమా విషయంలో కాస్త పట్టువిడుపుగా ఉంటానని హామీ ఇవ్వడంతో ఆ టైంలో డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ ఒత్తిడి చేయకుండా వెనక్కు తగ్గారు. అయినా కూడా కొంత మేర నష్టాలు పూడ్చారు కానీ పూర్తిగా మాత్రం వీలు పడలేదు. అందుకే అరవింద సమేత వీర రాఘవ ప్లానింగ్ లో కేర్ పీక్స్ లో ఉందని టాక్.

కానీ పవన్ సినిమా వల్ల తన సినిమాను చుట్టేస్తున్నారు అనే ఫీలింగ్ హీరోకు రాకూడదు కాబట్టి దానికి తగ్గట్టు నిర్మాణంలో రాజీ పడకుండా మిగిలిన వాటి మీద ఫోకస్ పెంచినట్టు తెలిసింది. అందులో భాగంగానే భారీగా ఛార్జ్ చేసే దేవి శ్రీ ప్రసాద్ బదులు థమన్ ను తీసుకున్నట్టు తెలిసింది. పైగా అజ్ఞాతవాసిలో అవసరానికి మించి సెట్స్ గ్రీన్ మాట్స్ ఎక్కువగా వేశారు. అవేవి తెరమీద కనిపించలేదు. అరవిందలో లాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహిస్తున్నట్టు తెలిసింది. టైం కూడా తక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ అవుట్ డోర్ లేకుండా పక్కా స్కెచ్ తో వర్క్ అవుట్ చేస్తున్నట్టు సమాచారం. కాస్ట్ ని కంట్రోల్ చేయటం పూర్తిగా సాధ్యం కాదు కానీ వీలైన వాటిని వదలకుండా జాగ్రత్త పడుతున్నారు. బిజినెస్ పరంగా కూడా గతంలో నష్టపోయిన వారికి కాస్త తక్కువకే ఇచ్చినా శాటిలైట్ తో పాటు డిజిటల్ రైట్స్ నుంచి రికవర్ చేయాలనే ప్రణాళిక జరుగుతోంది. మొత్తానికి పవన్ ప్రభావం ఇన్ డైరెక్ట్ గా తారక్ మీద పడినట్టే. కాకపోతే ఎన్టీఆర్ కున్న స్టార్ ఇమేజ్ ఎలాగూ క్రేజీ బిజినెస్ ఆఫర్స్ తీసుకొస్తుంది. టీజర్ వదిలితే చాలు ఈ లెక్కల్లో చాలా మార్పులు వచ్చేస్తాయి. అందుకే త్రివిక్రమ్ తన పెన్ పవర్ మరింత బలంగా విన్పించేలా ఎటువంటి ప్రయోగాలు చేయకుండా జాగ్రత్త వహించినట్టు తెలిసింది. సో త్రివిక్రమ్ సమేత జూనియర్ ఎన్టీఆర్ సినిమా మీద నమ్మకం పెట్టుకోవచ్చు అనేలా నిర్మాణం జరగడం అభిమానులకు గుడ్ న్యూసే.