Begin typing your search above and press return to search.

సైరాని కాపీ అంటే ఎలా ?

By:  Tupaki Desk   |   22 Aug 2019 7:33 AM GMT
సైరాని కాపీ అంటే ఎలా ?
X
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సైరా ప్రమోషన్ ఊపందుకుంది. మేకింగ్ వీడియోతో పాటు టీజర్ ఒకే వారంలో వచ్చేయడంతో అభిమానుల ఆనందం మాములుగా లేదు. అయితే సోషల్ మీడియాలో అత్యుత్సాహ పడుతున్న కొందరు నెటిజెన్లు సైరా లోని సీన్లు బాహుబలి నుంచి స్ఫూర్తి చెందినట్టు ఉన్నాయని రెండింటిని పోలుస్తూ ఫోటోలతో సహా పెట్టేయడంతో ఇవి కాస్తా వైరల్ అవుతున్నాయి.

చిరంజీవి బ్రిటిష్ సైనికుల మధ్యలో నుంచి పైకి ఎగిరి కత్తులు దూయడం పొదల్లో నుంచి గుర్రంపై స్వారీ చేస్తూ రావడం ఇలా రెండు మూడు సన్నివేశాలను దీంట్లో ఉదాహరించారు. అలాంటి కొన్ని షాట్స్ బాహుబలిలో ఉన్నట్టు అనిపించే మాట వాస్తవమే కాని యుద్ధ నేపధ్యాలు రెండు సినిమాల్లో కామన్ గా ఉన్నాయన్న పాయింట్ ని ఇక్కడ మర్చిపోకూడదు

అందులోనూ బాహుబలి కూడా చాలా రకాలుగా స్ఫూర్తి చెందినదే. అప్పట్లో 300 లాంటి సినిమాల బిట్స్ ని మ్యాచ్ చేస్తూ మేమ్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు సైరాకు రిపీట్ అవుతున్నాయి అంతే. రెండు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఇలాంటి విజువల్ వండర్స్ ప్రతిసారి వచ్చేవి కావు. అందులోనూ చిరంజీవి ప్రభాస్ లాంటి స్టార్లు చేసినప్పుడు ఇలా పోలికల పేరుతో వాటిని తక్కువ చేస్తూ వైరల్ చేయడం వాటిలోనూ మన తెలుగు సోషల్ మీడియా వాడకందారులే ఉండటం విచారకరం.