Begin typing your search above and press return to search.

సాహోకు మొదలైన పోలికల రచ్చ

By:  Tupaki Desk   |   21 May 2019 9:17 AM GMT
సాహోకు మొదలైన పోలికల రచ్చ
X
సోషల్ మీడియా యాక్టివ్ గా ఉన్నందుకు సంతోషించాలో లేక కోడిగుడ్డు మీద ఈకలు తీసే తరహాలో అదే పనిగా ట్రాలింగ్ కు దిగే కొందరు నెటిజెన్లను చూసి కోపం తెచ్చుకోవాలో అర్థం కాని పరిస్థితి. ప్రభాస్ ఫ్యాన్స్ అదే ఫీలవుతున్నారు. సాహో కొత్త పోస్టర్ వచ్చిన కొన్ని గంటలైనా గడవకముందే హాలీవుడ్ సినిమాల పోస్టర్లతో పోలిక తెచ్చి కాపీ కొట్టారు స్ఫూర్తి తెచ్చుకున్నారు అని పోస్ట్ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇందాకా వచ్చిన సాహో పోస్టర్ గతంలో వచ్చిన ఇంగ్లీష్ మూవీ హ్యంకాక్ లో హీరో లుక్ తరహాలో ఉందంటూ రెండు పక్కపక్కనే పెట్టి మరీ పోలిక తేవడం ఇప్పుడు వైరల్ అవుతోంది. నిజానికి సాహో టీం ప్లాన్డ్ గా ఒక్కో అడుగు వేస్తూ సాహోకు సంబంధించిన అప్ డేట్స్ ఇవ్వాలని ప్లానింగ్ లో ఉంది. ఇప్పుడు చూస్తే ఇలా ఉంది అలా ఉంది అంటూ పోలికలు తెస్తున్నారు. అయినా ఇది మొదటి సారి కాదు.

రాజమౌళి బాహుబలిని రజనికాంత్ కబాలిని దేన్నీ వదలలేదు వీళ్ళు. కంటెంట్ ఉంటే ఇవన్ని పెద్ద మ్యాటర్ కాదు. జనమూ పట్టించుకోరు. అందులో సాహో లాంటి విజువల్ గ్రాండియర్ మీద పెద్దగా ప్రభావం చూపించవు. ఆగస్ట్ 15 డేట్ మరోసారి ఖరారు చేసారు కాబట్టి చేతిలో మూడు నెలల కంటే తక్కువ టైం ఉంది. ఈలోపే సాహో గురించి హోరెత్తిపోయేలా పబ్లిసిటీ చేసేందుకు యూనిట్ సమాయత్తమావుతున్నట్టు టాక్. మల్టీ లాంగ్వేజ్ మూవీ కాబట్టి సౌత్ లో హంగామా చేస్తే సరిపోదు. పాన్ ఇండియా లెవల్ లో సాహో గురించి మాట్లాడుకునేలా చేయాలి. ప్రభాస్ స్వయంగా చెప్పాడు కాబట్టి ఇకపై డార్లింగ్ ఫ్యాన్స్ కు వరసగా ఏదో ఒక ట్రీట్ అందుతుంది