Begin typing your search above and press return to search.

ఈ సినిమా కథ తేజ రాసింది కాదా?

By:  Tupaki Desk   |   13 Aug 2017 5:38 PM GMT
ఈ సినిమా కథ తేజ రాసింది కాదా?
X
ఒక సినిమా హిట్టవ్వగానే ఆ కథ నాదే అంటూ చాలామంది వస్తుంటారు. అయితే అన్నిసార్లూ వారు చెప్పింది నిజం కాలేదు.. అలాగే కొన్నిసార్లు ఆ రైటర్ల ఘోష నిజమేనని కూడా తేలింది. శ్రీమంతుడు కథ నాదే అంటూ ఓ రైటర్ కేసేస్తే.. ప్రస్తుతం కోర్టులో విచారణ జరుగుతోంది. అలాగే కత్తి కథ నాదే అంటూ కేసు వేసిన రైటర్ ఏకంగా చిరంజీవి ఖైదీ నెం 150 సినిమా షూటింగ్ ఆపేసినంత పనిచేశాడు. చివరకు అదెలాగో సెటిల్ అయ్యింది. అయితే ఇప్పుడు ఇలా పరోక్షంగా కాని ప్రత్యక్షంగా కాని ఎవ్వరూ వచ్చి 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా కథ నాదే అనడంలేదు కాని.. ఫిలిం నగర్లో మాత్రం కొన్ని కొత్త రూమర్లు వినిపిస్తున్నాయ్.

అసలు 'నేనే రాజు నేనే మంత్రి' అనే కథను తిమ్మా రెడ్డి అనే ఒక రైటర్ రాశాడట. ఈ కథ నచ్చడంతో తనతో కొన్నాళ్ళు ట్రావెల్ అవ్వమని చెప్పి.. దానిని పూర్తి స్థాయి స్ర్కిప్టు తరహాలో అతనితోనే డెవలప్ చేయించాడట తేజ. ఇక సినిమా క్రెడిట్స్ లో రైటర్ అని పేరు వేయిస్తూ భారీగా రెమ్యూనరేషన్ కూడా ఇప్పిస్తానని హామీ ఇచ్చాడట. కాని కట్ చేస్తే ఈ సినిమా కథ తేజదే అని సినిమాలో వేశారు. అయితే రానాతో సినిమా స్టార్ట్ అయిన ద‌గ్గ‌ర నుంచి తిమ్మా రెడ్డి ని దూరం పెట్టాడ‌ట తేజ‌. దీంతో చేసేదేమిలేక తిమ్మ‌రెడ్డి సైలెంట్ అయిపోయాడ‌ని మరోవైపున ఆ రైట‌ర్ తిమ్మా రెడ్డి ప్ర‌స్తుతం ఆరోగ్య ప‌రంగా ఇబ్బందులు ప‌డుతున్నాడ‌ని స‌మాచారం..

ఒక ప్రక్కన ఆ రైటర్ ఎవరో కాని.. వచ్చి ఈ కథ నాదేనని కూడా అనడంలేదు. మరి ఈ రూమర్లో నిజముందా? లేకపోతే తేజ హిట్టు కొట్టాడు కాబట్టి ఎవరన్నా ఇలా బురద జల్లుతున్నారా? లేదంటే చాలామంది దర్శకుల తరహాలోనే తేజ కూడా కథను కబ్జా చేశాడా? ఇవన్నీ సమాధానాలు లేని రాని ఇవ్వలేని ప్రశ్నలు. ఓవర్ టూ తేజ!!