బిగ్ బాస్ నటికి శిక్ష తప్పదా?

Sun Aug 13 2017 12:38:49 GMT+0530 (IST)

బిగ్ బాస్ షోలో ఆత్మహత్యకు ప్రయత్నించిన తర్వాత తమిళ నటి ఓవియ హెలెన్ గతాన్ని మర్చిపోయి తన పని తాను చేసుకుంటూ వివిధ కార్యక్రమంలో పాల్గొంటుంది. ప్రస్తుతం ఆమె  విష్ణు విశాల్ - రెజినా కాసాండ్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న "సిల్లుకువరిపట్టి' అనే తమిళ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. ఈ చిత్రం కోసం ఓవియ తన స్టైల్ ను పూర్తిగా మార్చేసిన విషయం తెలిసిందే..అయితే ఆమె బిగ్ బాస్ షోలో ప్రవర్తించిన తీరుకు పోలీసులు ఆమెను పిలిపించి విచారణను చేయడానికి సిద్ధమయ్యారు. ఆత్మహత్య ప్రయత్నం నేరం కావడంతో శరవణన్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశాడు. ఆమె ఒక షోలో సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించిందని అందుకు కారణం బిగ్ బాస్ షోలో ఉన్న నియమాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం తమిళ నాట తీవ్ర దుమారాన్ని రేపుతోంది. అయితే ఓవియ కు సంబందించిన వారు ఈ వార్తను కొట్టి పారేస్తున్నారు. ఓవియ ఆత్మహత్య ప్రయత్నాన్ని వీరమించుకుంది కదా.. ఇంకెందుకు గొడవ అని మీడియా ముందు వాబోతున్నారు. అంతే కాకుండా ఎదో క్షణికవేశంలో చేసిందని సర్ది చెప్పుకుంటున్నారు.

లక్షల మంది చూసే షోల్లో ఇలా వ్యవహరించిన వారిని వదిలేది లేదు అంటున్నారు చాలా మంది ప్రముఖులు. అయితే ఇంత జరుగుతున్నా ఓవియా మాత్రం స్పందించకపోవడం గమనార్హం.