నేను హెచ్ఐవీ పాజిటివ్ నే -పాప్ సింగర్

Tue Apr 17 2018 10:08:19 GMT+0530 (IST)

కొంచితా వురస్ట్.. ఆస్ట్రియాకు చెందిన ఈ పాప్ సింగర్ గురించి మ్యూజిక్ ప్రియులకు చెప్పాల్సిన పని లేదు. జన్మతహా పురుషుడే అయినా.. తనలో ఉన్న వైరుధ్యాలను టీనేజ్ సమయంలోనే గుర్తించిన థామస్ న్యూవిర్త్.. ఆ తర్వాత కొంచితగా అవతారం ఎత్తాడు. తాను గే అని చెప్పడం మాత్రమే కాదు.. గే రైట్స్ కోసం సపోర్టర్ కూడా.తనను తాను ఓ మహిళగానే ప్రొజెక్ట్ చేసుకుని.. కొంచిత అనే పేరుతో కంటిన్యూ అవుతుండడం విశేషం. ఇప్పుడు ఈ పాప్ సింగర్ తాను హెచ్ ఐవీ పాజిటివ్ అనే విషయాన్ని ప్రపంచానికి వెల్లడించేసింది. లక్షలాది మంది ఫాలోయర్స్ కు.. ఓ ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది కొంచిత. ఇది జనాలు అందరికీ చెప్పాల్సిన అవసరం లేకపోయినా.. పరిస్థితులు ఇలా ప్రకటించాల్సిన సిట్యుయేషన్ ను తీసుకొచ్చాయని చెప్పింది. 'నా మాజీ బాయ్ ఫ్రెండ్ ఒక వ్యక్తి.. ఈ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ను అందరికీ చెబుతానంటూ కొంతకాలంగా నన్ను బెదిరిస్తున్నాడు. ఎవరో నన్ను బెదిరించడం.. వారి కారణంగా నా జీవితం మీద ప్రభావం పడడం నాకు ఇష్టం లేదు' అని చెప్పిన కొంచితకు.. ప్రపంచవ్యాప్తంగా చాలానే గుర్తింపు ఉంది.

కొన్నేళ్లుగా తాను హెచ్ఐవీ ట్రీట్మెంట్ తీసుకున్నట్లు చెప్పగా.. ప్రస్తుతం తనలో ఈ వైరస్ స్థాయి డిటెక్షన్ లెవెల్ కంటే తక్కువగానే ఉందని వెల్లడించింది. తన కారణంగా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం లేదని కొంచిత చెప్పడం విశేషం.