Begin typing your search above and press return to search.

వంగవీటిపై గాంధీ కంప్లెయింట్

By:  Tupaki Desk   |   12 Feb 2016 4:52 AM GMT
వంగవీటిపై గాంధీ కంప్లెయింట్
X
అనుకున్నంతా అవుతోంది. మరి ఇలానే అవాలని చెప్పాడో.. ప్రచారం ఆశించి చెప్పాడో కానీ.. రాంగోపాల్ వర్మ సినిమా వంగవీటికి పై కంప్లెయింట్లు మొదలయ్యాయి. వంగవీటి మూవీలో కేరక్టర్లుగా రాజీవ్ గాంధీ - నందమూరి తారక రామారావు కూడా ఉంటారని వర్మ చెప్పగానే.. ఈ మూవీ సంగతి రౌడీయిజం నుంచి రాజకీయానికి టర్న్ తీసుకుంది.

ఇప్పుడు ఏకంగా వంగవీటిపై బెజవాడ పోలీస్ కమిషనర్ కి కంప్లెయింట్ వెళ్లింది. గాంధీ గ్లోబల్ ట్రస్ట్ సభ్యులు.. వంగవీటి మూవీపై పోలీసులను ఆశ్రయించారు. ఈ సినిమా కులాల మధ్య చిచ్చు పెట్టేలా ఉందంటూ అనుమానం వ్యక్తం చేశారు. ముప్ఫై ఏళ్ల క్రితం జరిగిపోయిన విషయాలను.. మళ్లీ ఇప్పుడు తెరపై చూపిస్తే.. బెజవాడలో ప్రశాంతత దెబ్బ తింటుందని కూడా ఫిర్యాదు చేశారు. ఇలా ఓ సినిమా కారణంగా శాంతిభద్రతల సమస్య కూడా వస్తుందనే అనుమానం వ్యక్తం చేశారు.

ఈ గాంధీ ట్రస్ట్ సభ్యులు కమిషనర్ కి కంప్లెయింట్ తో ఆగకుండా.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు కూడా ఓ విన్నపం చేశారు. అసలు వర్మ ఏం తీస్తున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేయాలని, మరోసారి కులాల మధ్య తగాదాలతో రక్తపాతం జరిగే పరిస్థితులు తలెత్తకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. మొత్తానికి వర్మ చేస్తున్న పబ్లిసిటీతో పాటు.. ఇప్పుడు ట్రస్టులు, రాజకీయాలు కూడా తోడవడంతో.. వంగవీటి మూవీకి ప్రచారం మాత్రం బోలెడంత వస్తోంది.