పులికేసికి కోపం వచ్చిందబ్బా!!

Tue Apr 17 2018 11:33:37 GMT+0530 (IST)

మన టాలీవుడ్ లో బ్రహ్మానందం ఎలాగో కోలీవుడ్ లో కూడా అంతటి ఇమేజ్ సంపాదించుకున్న కమెడియన్ వడివేలు. ఆయన సినిమాల్లో ఉన్నారంటే చాలు ప్రేక్షకులు సినిమా చూడటానికి వచ్చేస్తారు. ఆయన హీరోగా చేసిన 23వ రాజు పులికేసి సినిమా మంచి హిట్ అయిన సంగతి తెలిసిందే. పూర్తిగా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆ సినిమాకు మంచి ఆదరణ దక్కింది. ప్రముఖ దర్శకుడు శంకర్ కో ప్రొడక్షన్ లో సీక్వెల్ కూడా ప్లాన్ చేశారు. అయితే సినిమా 2016లోనే ప్లాన్ చేయినప్పటికి ఇంకా షూటింగ్ అయిపోలేదు.దీంతో వడివేలు పూర్తి అసహనం వ్యక్తం చేశాడు. ఇమ్మాయి అరాసన్ 24  పులకేసీ-2 (24వ రాజు పులికేసి సీక్వెల్) సినిమా కారణంగా చాలా వరకు తన తేదీలను వృధా చేసుకున్నట్లు తెలిపారు. ఇక ఆ చిత్ర యూనిట్ తో పనిచేయలేను అని చెబుతూ..2016 లోనే నా డేట్స్ ఇచ్చాను. కానీ వాళ్లు ఇంకా పొడిగించారు. కాస్ట్యూమ్ డిజైనర్ ని అలాగే చాలా వరకు ప్రొడక్షన్ టీమ్ ను మార్చేశారు అని తెలిపారు. ఇక వాళ్లు తమిళ ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వద్ద ఫిర్యాదు చేసి బెదిరిస్తున్నారు అంటూ.. నేను వారి చర్యల ద్వారా బడపడ్డాను అన్నారు.

అదే విధంగా  ఆలస్యం కారణంగా ఇతర చిత్రాలలో కూడా నటించకపోవడం వల్ల ఆర్థికంగా దెబ్బ తిన్నాను వడివేలు వివరించారు. అయితే తమిళ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఇంకా వడివేలు కామెంట్స్ పై స్పందించలేదు. ఒకవేళ TFPC వడివేలు వ్యవహారం కారణంగా  వేటువేస్తే వడివేలు మద్రాస్ కోర్టును ఆశ్రయించి ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ లైకా ప్రొడక్షన్ - అలాగే శంకర్ ప్రొడక్షన్ ఈ సినిమాకు నిర్మాతలు. చింబు దేవన్ దర్శకుడు.