త్రివిక్రమ్ టీజర్స్.. పోలికలు చెప్పేస్తున్నారు..

Thu Aug 16 2018 10:19:55 GMT+0530 (IST)

ఘనంగా ప్రారంభిస్తారు.. టీజర్ తో సంచలనాలు సృష్టిస్తారు..కానీ ఆ తర్వాత సినిమాకెళ్తే అస్సలు ఆ సీన్లే ఉండవు.. కేవలం హైప్ తీసుకురావడం కోసమే టీజర్ కోసం ప్రత్యేక షాట్ లు తీస్తారు.. ఈ ఒరవడి కొద్ది కాలంగా టాలీవుడ్ లో వస్తోంది. ఇది అంతిమంగా ఆ సినిమా ఫ్లాప్ లకు కారణమవుతోంది..మహేష్ బాబు నటించిన ‘స్పైడర్’ మూవీ విడుదలకు ముందు రిలీజ్ చేసిన టీజర్ సంచలనాలు సృష్టించింది. ‘స్పైడర్ ’ అనే చిన్న చీమ లాంటి రోబోట్ మహేష్ భుజంపైకి ఎక్కి పరిశోధనలో భాగం పంచుకున్నట్టు చూపించారు. కానీ తీరా సినిమాలోకి వెళితే ఆ బుల్లి రోబో లేదు.. అస్సలు కథకు రోబోకు సంబంధం లేదని ప్రేక్షకులు నిరుత్సాహ పడ్డారు.

ఇక అజ్ఞాతవాసి కోసం కూడా దర్శకుడు త్రివిక్రమ్ పలు సీన్లను టీజర్ కోసం ప్రత్యేకంగా షూట్ చేశాడు.. ఓ పాత షెడ్డులో కుర్చీని తిప్పుతూ పవన్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. కానీ తీరా సినిమాలోకి వెళితే..  ఆ సీన్ ను ఏదో టీజర్ లో చూపించాం కాబట్టి ఇరికించినట్టు కనిపించింది. ఎందుకంటే పవన్ చెప్పే ఆ సీరియస్ నెస్ డైలాగ్ వెనుక పెద్ద కారణాలు ప్రేక్షకులకు కనిపించలేదు.

ఇప్పుడు అదే త్రివిక్రమ్... ఎన్టీఆర్ తో అరవింద సమేత తీస్తున్నాడు. నిన్న విడుదల చేసిన టీజర్ కు మంచి స్పందన వస్తోంది. చాలా మంది ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ టీజర్ మైండ్ బ్లోయింగ్ అంటున్నారు. సేమ్ అజ్ఞాతవాసి టీజర్ లో చూపినట్టే పాత కుర్చీలు. ఓ పాడుబడ్డ ఇంటిలో హీరో భారీ డైలాగ్ చెప్పాడు. మరి ఈ సీన్లు ఎమోషన్లు సినిమాలో ఉంటాయా.? ఉండవా.? అన్నది సినిమా విడుదలైతే గానీ చెప్పలేని పరిస్థితి..