Begin typing your search above and press return to search.

రాఘవా పోలికలు ఆగవా!!

By:  Tupaki Desk   |   22 Sep 2018 8:56 AM GMT
రాఘవా పోలికలు ఆగవా!!
X
ఏడాది గ్యాప్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా అరవింద సమేత వీర రాఘవ విడుదలకు రెడీ అవుతోంది. రిలీజ్ కు సరిగ్గా 20 రోజులు మాత్రమే టైం ఉన్న నేపధ్యంలో తారక్ ఫాన్స్ చాలా ఉత్సాహంతో ఉన్నారు. ఇటీవలే విడుదలైన ఆడియోకు మంచి స్పందనే దక్కినప్పటికీ మాస్ ప్రేక్షకులకు కావాల్సిన మసాలా సాంగ్ ఒకటే ఉందన్న కామెంట్ నేపధ్యంలో అభిమానులు మాత్రం దీని మీద కొండంత ఆశలు పెట్టుకున్నారు. ఇక ఆడియోలో ఫ్యాక్షన్ కక్షల నేపథ్యంలో ఏకంగా రెండు పాటలు ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక్కడే కొన్ని వెనుకటి సినిమాలతో పోలిక తెస్తున్నారు విశ్లేషకులు. సాధారణంగా ఫ్యాక్షన్ సినిమాల్లో ఒక కామన్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో హీరో నార్మల్ గా అందరి మధ్య ఉంటూ ప్రేయసితో పాటలు పాడుకుంటూ జాలీగా ఉంటాడు. కట్ చేస్తే అతనికో భయంకరమైన ఫ్యాక్షన్ చరిత్ర ఉందని ఇంటర్వెల్ టైం లో తెలుస్తుంది. అక్కడి నుంచి కథ కొత్త మలుపులు తీసుకుని హీరో ఉండే ఊరికి వెళ్ళిపోయి విలన్ల అంతు చూడటం దాకా సాగుతుంది.

ఎవరివో అవసరం లేదు. తారక్ కు మొదటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఆది లైన్ ఇదే. ఫస్ట్ హాఫ్ కాలేజీలో సెకండ్ హాఫ్ వయొలెంట్ గా పల్లెటూరిలో నాన్న ఆహుతి ప్రసాద్ హత్యకు ప్రతీకారంగా రివెంజ్ మోడ్ లో సాగుతుంది. ప్రభాస్ మిర్చిలో ఫస్ట్ హాఫ్ రిచాతో ప్రేమలో టైం పాస్ చేసి సెకండ్ హాఫ్ నాన్న సత్యరాజ్ కుటుంబం కోసం గ్రామానికి వస్తాడు హీరో. అక్కడ నుంచి కొత్త మలుపులు తీసుకుంటుంది. ఇలా చాలా ఉదాహరణలు కనిపిస్తాయి కానీ అరవింద సమేత వీర రాఘవ ఆడియో ట్రాక్స్ ని ఎనాలిసిస్ చేస్తూ స్టిల్స్ గమనించిన వాళ్లకు ఇవే గుర్తుకు వస్తున్నాయి. త్రివిక్రమ్ వీటికి భిన్నంగా ఏమైనా అలోచించి ఉంటే రిలీజయ్యాక ఇవన్నీ పటాపంచలు అయిపోతాయి. కానీ ఇప్పటి దాకా వచ్చిన ప్రమోషన్ మెటీరియల్ ఇంకా ఆ గ్యారెంటీ ఇవ్వలేదు. మరి ట్రైలర్ తో వీటినేమైనా అందుకుంటారేమో చూడాలి.