Begin typing your search above and press return to search.

సైలెంటుగా లిప్ లాక్ లాగించేసిందే..

By:  Tupaki Desk   |   20 Feb 2017 4:33 AM GMT
సైలెంటుగా లిప్ లాక్ లాగించేసిందే..
X
‘హార్ట్ ఎటాక్’ భామ ఆదా శర్మ.. ఉన్నట్లుండి పెద్ద షాకే ఇచ్చింది. ‘కమాండో-2’ సినిమా కోసం హీరో విద్యుత్ జమాల్ తో లిప్ లాగించేసింది. ‘హార్ట్ ఎటాక్’ దగ్గర్నుంచి ఆదా కొంచెం గ్లామర్ గా కనిపిస్తోంది తప్ప.. హద్దులు దాటిపోయింది లేదు. ఆమె లిప్ లాక్ సీన్లో నటిస్తుందని ఎవరూ అనుకోలేదు. ‘కమాండో-2’ ట్రైలర్లో కూడా ఆదా మామూలుగానే కనిపించింది. ఐతే లేటెస్టుగా ఈ సినిమా పాట తాలూకు వీడియో ఒకటి రిలీజ్ చేశారు. అందులో విద్యుత్ జమాల్.. ఆదాతో ఘాటు ముద్దు లాగించేశాడు.

‘కమాండో-2’ అంటే ఓన్లీ యాక్షనే అనుకునే వాళ్లకు.. ఇందులో రొమాన్సుకు కూడా ఢోకా లేదని హింట్ ఇచ్చారు. ఈ రోజుల్లో లిప్ లాక్స్ కామనే అన్నట్లు ఈ కిస్ గురించి తేలిగ్గా మాట్లాడుతోంది ఆదా. ఈ సినిమాలో మరో కథానాయికగా ఇషా గుప్తా కూడా నటిస్తోంది. విద్యుత్ ఆమెతో కూడా రొమాన్స్ చేశాడేమో చూడాలి.

మూడేళ్ల కిందట వచ్చిన ‘కమాండో’ ఓ మోస్తరుగా ఆడింది. ఇప్పుడు దానికి సీక్వెల్ కొంచెం పెద్ద స్థాయిలోనే చేసినట్లున్నారు. ప్రమోషన్ కూడా కొంచెం గట్టిగానే చేస్తున్నారు. దేవేన్ భోజాని దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 3న ప్రేక్షకుల ముందుకొస్తుంది. బ్లాక్ మనీ గుట్టు రట్టు చేసే కమాండో కథ ఇది. తెలుగులో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండటం విశేషం. ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా ట్రైలర్ గురించి ట్వీట్ చేస్తూ.. విద్యుత్ కు ఆల్ ద బెస్ట్ చెప్పడం తెలిసిందే.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/