విజయ్ ఆత్మహత్యపై తండ్రి అనుమానం

Mon Dec 11 2017 15:04:21 GMT+0530 (IST)

ఈ ఉదయం తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద షాక్ తగిలింది. ‘అమ్మాయిలు అబ్బాయిలు’.. ‘బొమ్మరిల్లు’ లాంటి సినిమాలో చక్కటి వినోదం పండించిన కమెడియన్ వినోద్ ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న వార్త అందరినీ కలిచి వేసింది. చేసింది తక్కువ సినిమాలే అయినా.. వాటిలో చక్కటి వినోదం పండించిన విజయ్ జీవితం ఇలా ముగిసిపోవడం అందరికీ వేదన మిగిల్చింది. ఆత్మహత్య చేసుకోవాల్సింత అవసరం విజయ్ కి ఏం వచ్చిందా అని అందరూ చర్చించుకుంటున్నారు. ఐతే తన కొడుకు సినీ అవకాశాలు లేకపోవడం వల్లే ఆత్మహత్యే చేసుకోలేదని అంటున్నాడు విజయ్ తండ్రి. అతడి మరణానికి తన కోడలు వనితా రెడ్డినే కారణమని ఆయన ఆరోపిస్తున్నారు.వనితా రెడ్డితో తన కొడుక్కి ఐదేళ్ల కిందట పెళ్లి జరిగిందని.. వీళ్లిద్దరికీ ఒక పాప కూడా ఉందని విజయ్ తండ్రి తెలిపారు. సినిమా అవకాశాలు రాకపోవడం విజయ్ ఆత్మహత్యకు కారణం కాదని ఆయన స్పష్టం చేశారు. కొంత కాలంగా వనిత తన కొడుక్కి దూరంగా ఉంటోందని.. అతడి నుంచి ఆమె డబ్బు.. నగలు దౌర్జన్యంగా లాక్కుని వెళ్లిపోయిందని ఆయన ఆరోపించారు. అంతే కాక ఆదివారం వనిత.. విజయ్ ఇంటికి కొందరు మనుషుల్ని పంపించి.. అతడి కారును కూడా బలవంతంగా తీసుకెళ్లిందని.. ఈ నేపథ్యంలోనే వేదనకు గురై విజయ్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని ఆయన అన్నారు. పోలీసులు తన కొడుకు ఆత్మహత్యపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.