అక్కడికి మన కమెడియన్లు లేనట్లు..

Sat Aug 12 2017 06:00:01 GMT+0530 (IST)

బ్రహ్మానందం జోకేస్తే నవ్వు రాదు. మన రైటర్ బాగా రాస్తే ఆయన వేసిన జోక్ పండుతుంది. అలాగే తక్కిన కమెడియన్లకు కూడా అంతే. ఇకపోతే మన దగ్గర మామూలుగానే హీరోయిన్లను రెగ్యులర్ గా పక్క రాష్ట్రాల నుండి ఇంపోర్ట్ చేస్తుంటారు. అప్పుడప్పుడు మన అదృష్టం కొద్దీ హీరోలను కూడా అరువు తెచ్చుకుంటాం. ఈమధ్యనే రాజమౌళి అండ్ కొరటాల వంటి దిగ్గజాలు క్యారక్టర్ వేషాలకు కూడా పొరుగు రాష్ట్రాల నటులనే తెస్తున్నారు. ఇప్పుడు ఏకంగా కమెడియన్లను కూడా అక్కడి నుండే తెచ్చేలా ఉన్నారు ఇతరులు.ప్రస్తుతం చేతిలో వేరే సినిమాల్లేవ్ కాని.. తన సినిమాను తానే ప్రొడ్యూస్ చేసుకుంటున్నాడు నాగ శౌర్య. కొత్త కుర్రాడు వెంకీ కుడుముల డైరక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు. ఇందులో కర్ణాటకలో ఫేమస్ అయిన రష్మిక మందన్నాను ఆల్రెడీ హీరోయిన్ గా తీసుకున్నారు. ఆమె హైదరాబాద్ వచ్చి షూటింగులో కూడా పాల్గొని వెళ్ళింది. కట్ చేస్తే ఈ సినిమాలో.. ఎప్పుడూ తన గుండుతో అలరించే మొట్ట రాజేంద్రన్ ఉన్నాడు చూడండి.. ఏది మన లారెన్స్ సినిమాల్లో సూర్య సినిమాల్లో కనిపిస్తుంటాడే.. అతనే.. అతనితో ఇప్పుడు తెలుగు డెబ్యూ చేయిస్తున్నారట. ఈ సినిమాతో తెలుగులో డైరక్టుగా ఎంట్రీ ఇవ్వనున్నాడు తమిళ కమెడియన్ రాజేంద్రన్.

వినడానికి.. సినిమాకు పాపులార్టీ తీసుకురావడానికి.. ఇది చాలా బాగుంటుందిలే. కన్నడ కిరిక్ పార్టీతో ఫేమస్ అయిన హీరోయిన్.. తమిళ ఫేమస్ కమెడియన్.. ఇలా అంతా బాగానే ఉంది. కాని ఒక్కటే ప్రశ్న అస్తమానం అందరూ అడుగుతుంటే.. వాటికి మాత్రం మన ఫిలంమేకర్ గయ్స్ దగ్గర నుండి ఆన్సర్ రావట్లేదు. ఆ ప్రశ్న ఏంటంటే.. టాలెంట్ మన దగ్గర లేదా? అరువు తెచ్చుకోవాలా అనే. నటులకు బౌండరీలు లేవు ఒప్పుకుంటాం.. కాని మరీ మన ఇంట్లోకి వచ్చి మ్యాచులన్నీ వేరే దేశం ఆటగాళ్లే ఆడతానంటే తట్టుకోలేంగా.. అంటున్నారు సినిమా లవ్వర్స్.