ఆరోజు మెగాబ్రదర్ తో మాట్లాడా!

Thu Mar 14 2019 20:39:21 GMT+0530 (IST)

30 ఇయర్స్ పృథ్వీ దూకుడు గురించి తెలిసిందే. ఓ వైపు క్యారెక్టర్ నటుడిగా బిజీగా ఉంటూనే.. ప్రస్తుతం రాజకీయాల్లో  వైసీపీ తరపున ఆ పార్టీ కీలక బాధ్యతలు చేపట్టి ప్రచార సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా వింగ్ తరపున బలమైన గొంతు వినిపించడంలో పృథ్వీ పని తనానికి ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే ఇదే దూకుడులో పృథ్వీ చేసిన ఓ కామెంట్ మెగా బ్రదర్ నాగబాబుకు కోపం తెప్పించిన సంగతి తెలిసిందే.ఓ మీడియా చాట్ లో పృథ్వీకి మెగా బ్రదర్ వార్నింగ్ ఇచ్చారు. ``ఒరేయ్ పృథ్వీ .. నాకు ఫోన్ చెయ్ ఇప్పుడే.. దీని గురించి మాట్లాడదాం`` అని సీరియస్ అయ్యారు. మెగా బ్రదర్ ఫైర్ అనంతరం పృథ్వీ స్పందించాడా?  లేదా? అన్నది ఇప్పటివరకూ ఎవరికీ తెలీదు. ఇంతకాలానికి పృథ్వీ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం  చేశాడు.

నేను జనసేన గురించి తప్పుగా ఏదీ మాట్లాడలేదు. ఆరోజు నేను నాగబాబు గారికి రాత్రి 11 గంటలకు కాల్ చేసి మట్లాడాను. నేను ఎప్పుడూ అంత చెత్త కామెంట్లు జనసేనపై చేయలేదని చెప్పాను. మీరు అలా భావిస్తున్నారా? అలాంటి  కామెంట్లు చేస్తానా? ఆధారం లేని ఆరోపణలు అవి.. అని తనకు చెప్పాను.. అని పృథ్వీ తెలిపారు. అలా ఆ ఇష్యూ షార్ట్ అవుట్ అయ్యిందని అన్నారు. పృథ్వీ ప్రస్తుతం వైసీపీకి సేవలందిస్తున్నా గతంలో మెగా బ్రదర్ నాగబాబుతో కలిసి ప్రజారాజ్యం  పార్టీ కోసం పని చేశాడు. అందుకే ఇప్పుడు పృథ్వీ ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.