జోగినాయుడు రెండో పెళ్లి..!

Fri Aug 17 2018 17:25:24 GMT+0530 (IST)

టాలీవుడ్ టాప్ యాంకర్ గా వెలుగు వెలిగింది యాంకర్ ఝాన్సీ. ఆమె జెమినీ టీవీలో మకుఠం లేని మహా యాంకర్ గా చాలా కాలం పనిచేశారు. ఝాన్సీ యాంకర్ గా.. జోగినాయుడు ప్రొగ్రాం డైరెక్టర్ గా ఉన్న సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. అది ప్రేమ పెళ్లికి దారి తీసింది. వీరికి సంతానం  కలిగాక విభేదాలతో విడిపోయారు. ప్రస్తుతం ఝాన్సీ తన పిల్లలతో వేరుగా ఉంటుండగా... జోగినాయుడు సినిమాల్లో చిన్న చితక పాత్రలు చేస్తూ జీవిస్తున్నాడు.యాంకర్ ఝాన్సీతో విడాకులు తీసుకున్న జోగినాయుడు తన స్వగ్రామానికి చెందిన సౌజన్యను సాంప్రదాయబద్దంగా ఈరోజు వివాహమాడారు. అన్నవరంలోని సత్యనారాయణ స్వామి ఆలయంలో వీరి వివాహం సింపుల్ గా జరిగింది.. విశాఖ జిల్లా నాతవరం మండలం చెర్లోపాలెం గ్రామానికి చెందిన జోగినాయుడు తన స్వగ్రామానికి చెందిన  అమ్మాయినే వివాహం చేసుకోవడం విశేషం. వీరి పెళ్లితో యాంకర్ ఝాన్సీకి షాక్ కు తగిలినట్టే భావిస్తున్నారు. ఎందుకంటే భర్తతో విడిపోయినా కూడా ఝాన్సీ మరో పెళ్లి చేసుకోలేదు.కానీ జోగినాయుడు చేసుకోవడం విశేషం.   మళ్లీ పెళ్లి చేసుకున్న జోగినాయుడికి సినీ ప్రముఖులతో పాటు కమెడియన్లు ప్రోగ్రామ్ నటులు శుభాకాంక్షలు తెలిపారు.