Begin typing your search above and press return to search.

నవ్వించే ఆలీని ఏడిపించేశారు

By:  Tupaki Desk   |   4 Oct 2015 5:30 PM GMT
నవ్వించే ఆలీని ఏడిపించేశారు
X
సినిమా వాళ్లలో కొద్ది మందికి మాత్రమే సమాజం పట్ల బాధ్యత ఉంటుంది. అలాంటి వాళ్లలో కమెడియన్ ఆలీ కూడా ఒకడు. తన సొంత ప్రాంతం రాజమండ్రిలో ఆలీ చాలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాడన్న సంగతి కొద్దిమందికే తెలుసు. తాజాగా అతను మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. జైలు జీవితం గడుపుతున్న నలుగురు ఖైదీలకు చెందిన కుటుంబాల్ని దత్తత తీసుకున్నాడు. వారి బాగోగులు చూసే బాధ్యతను నెత్తికెత్తుకున్నాడు. మిగతా వాళ్లెవరికీ రాని ఈ ఆలోచన ఆలీకే రావడానికి కారణం లేకపోలేదు.

మొన్న గాంధీ జయంతి సందర్భంగా చంచల్ గూడ జైల్లో జరిగిన వేడుకలకు ఆలీని ముఖ్య అతిథిగా పిలిచారు జైలు అధికారులు. ఆలీ కూడా మామూలుగానే అక్కడికి వెళ్లాడు. వేడుకల్లో పాల్గొన్నాడు. ఐతే వేడుకల అనంతరం అక్కడి మహిళా ఖైదీల్ని కలిసి మాట్లాడాడు ఆలీ. ఆ సందర్భంగా వారి దీన గాథల్ని విని, వారి కుటుంబాలు పడుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడట ఆలీ. ఏళ్లకు ఏళ్లు జైల్లోనే ఉండిపోవడంతో తమ పిల్లలు పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పేసరికి కదిలియిన ఆలీ.. మీ బిడ్డల్ని ఆదుకుంటానని హామీ ఇచ్చి.. నాలుగు కుటుంబాలకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నాడట. వారికి ఆర్థిక సాయం అందించడంతో పాటు అన్ని రకాలుగా తోడ్పాటు అందించడానికి సిద్ధమవుతున్నాడు మన స్టార్ కమెడియన్.